ENGLISH

టాలీవుడ్‌కి విజయదశమి ఊపు తెస్తోందిగానీ..

22 October 2020-11:00 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఏడెనిమిది నెలలుగా పూర్తి స్తబ్దత నెలకొంది. ఇలా ఇంకెన్నాళ్ళు.? అంటూ తీవ్ర ఆవేదనలో వున్న తెలుగు సినీ పరిశ్రమకి ఇప్పుడిప్పుడే కాస్త ఉత్సాహం వస్తోంది. కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్‌లు, సినిమా షూటింగుల పునఃప్రారంభాలతో వస్తోన్న ఆ ఊపు, ముందు ముందు మరింత పెరగబోతోంది.

 

‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా నుంచి ఓ అద్భుతమైన వీడియో ప్రోమో రాబోతోంది. ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి సర్‌ప్రైజ్‌ అప్‌డేట్స్‌ వస్తున్నాయి.. ఇలా ఒక్కో పెద్ద సినిమా నుంచీ వస్తోన్న అప్‌డేట్స్‌తో అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ బోల్డంత ఉత్సాహం కనిపిస్తోంది. అయితే, ఇక్కడితో సంబరపడ్డానికి వీల్లేదు. సినిమా దియేటర్లు తెరుచుకుంటేనే అసలు సిసలు మజా.. అన్నది నిర్వివాదాంశం. ఓటీటీ రిలీజులతో కొంత ‘స్తబ్దత’ తగ్గిన మాట వాస్తవం. కానీ, ఆ ఓటీటీ రిలీజులతో పూర్తిస్థాయి జోష్‌ అయితే రాలేదు.. వచ్చే అవకాశమూ లేదు.

 

సినిమా దియేటర్లు తెరుచుకుంటేనే అసలు సిసలు మజా.. అన్నది నిర్వివాదాంశం. ఓటీటీ రిలీజులతో కొంత ‘స్తబ్దత’ తగ్గిన మాట వాస్తవం. కానీ, ఆ ఓటీటీ రిలీజులతో పూర్తిస్థాయి జోష్‌ అయితే రాలేదు.. వచ్చే అవకాశమూ లేదు. సినిమా దియేటర్లు తెరుచుకున్నాకే అసలు సిసలు పండగ.. అని అంటున్నారు అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు. త్వరలో ది¸యేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోనున్నాయి. తొలుత చిన్న సినిమాలు, ఆ తర్వాత పెద్ద సినిమాలు దియేటర్లలో సందడి చేయొచ్చు. ఈలోగా ట్రయల్‌ బేసిస్‌లో పాత సినిమాల రిలీజులూ వుండబోతున్నాయి. సినిమా పరిశ్రమ అంటే వందల కోట్ల వేల కోట్ల వ్యాపారం.. ప్రత్యంక్షగానో పరోక్షంగానో బోల్డంతమందికి ఉపాధినిస్తుంది. సో, పరిశ్రమ ఊపులో వుండడం అందరికీ అవసరమే.

ALSO READ: బ‌న్నీకి విల‌న్ దొరికాడా?