ENGLISH

సైరాకి హాలీవుడ్ టెక్నీషియన్

23 August 2017-19:39 PM

యాక్షన్ డైరెక్టర్ గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న టోని చింగ్ ఇప్పుడు మన మెగా స్టార్ 151వ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడు.

వివరాల్లోకి వెళితే, స్పైడర్ మేన్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టోని చింగ్ ని సైరా నరసింహా రెడ్డి చిత్రానికి పనిచేయడానికి రామ్ చరణ్ & కో ఆయనను సంప్రదించగా ఆయన ఈ కథ విని వెంటనే ఒకే చెప్పేశారట.

ఇప్పటికే ఈ చిత్రం కోసం టాప్ టెక్నీషియన్స్ అయిన రాజీవన్, ఏ ఆర్ రెహ్మాన్, రవివర్మన్ లను ముఖ్య టెక్నీషియన్స్ గా తీసుకాగా ఇప్పుడు ఈ హాలీవుడ్ టెక్నీషియన్ మెగా టీంలో చేరడంతో సైరా నరసింహా రెడ్డికి అంతర్జాతీయంగా ఫోకస్ వచ్చింది.

టోనీ చింగ్ ఇంతకముందు హ్రితిక్ రోషన్ నటించిన క్రిష్ 3 చిత్రానికి కూడా యాక్షన్ డైరెక్టర్ గా పనిచేశాడు.

 

ALSO READ: జైలవకుశ ఆడియో విడుదలకి ముహూర్తం ఫిక్స్