ENGLISH

ఐఎండిబి లిస్ట్ లో టాప్ 20 వీళ్ళే!

30 May 2024-23:39 PM

టాప్ 100 మోస్ట్ వ్యూయిడ్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ది లాస్ట్  డికేడ్ 2014-2024 పేరుతో ఐఎండిబి రీసెంట్ గా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దీపికా పదుకొనే టాప్ వన్ లో నిలిచింది. దశాబ్ద కాలంగా అత్యధికంగా వీక్షించిన ఇండియన్ యాక్టర్స్ లిస్ట్ లో దీపికా అగ్ర స్థానం దక్కించుకోవటం విశేషం. జనవరి 2014 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ లిస్ట్ ఫైనల్ చేసారు. 100 మంది తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు. కానీ టాప్ టెన్ లో కేవలం బాలీవుడ్ యాక్టర్స్ మాత్రమే నిలిచారు. 


టాప్ వన్ లో దీపికా నిలిచింది. కెరియర్ ప్రారంభంచిన దగ్గర నుంచి అదే ఆదరణతో, సక్సెస్ ఫుల్ గా జర్నీ కొనసాగిస్తూ సినీపరిశ్రమలో తన వంతు కృషి చేస్తున్న కారణం ఒకటి, తన స్టైల్, ఛరిష్మా వలన కూడా దీపికా నంబర్ వన్ గా నిలిచినట్లు ఐఎండిబి పేర్కొంది. 2007 లో ఓం శాంతి ఓం తో కెరియర్ మొదలుపెట్టిన దీపికా తోలి చిత్రంతోనే విశేష ఆదరణ పొందింది. ఈ మూవీ తర్వాత దీపిక వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు  తన ఖాతాలో ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరక్టర్స్, యాక్టర్స్ అందరితో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. నెక్స్ట్ హాలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమయ్యింది. ఇప్పడు సౌత్ లో కల్కి సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ లో ఖాన్ ల హవా ఎక్కువ వారిని కూడా వెనక్కి నెట్టి దీపికా నంబర్ వన్ స్థానం పొందటం గమనార్హం. ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కూడా దీపికా ధాటికి తట్టుకోలేక మూడో స్థానంతో సరిపెట్టుకుంది.                     


దీపికా తరువాత స్థానాల్లో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5 లో నిలిచారు. అమీర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లు టాప్ టెన్ లో నిలిచారు.  సౌత్ స్టార్స్ లో సమంత 13 ప్లేస్ లో, తమన్నా 16, నయన తార 18 ప్లేస్ లో నిలిచారు. సౌత్ స్టార్స్ లో కేవలం హీరోయిన్స్ మాత్రమే టాప్ 20 లో ఉన్నారు. అమితాబ్ 12, రణబీర్ 17, దీపికా భర్త రణవీర్ సింగ్ 19 స్థానంలో ఉన్నారు.