ENGLISH

Sanjay Ramaswamy: సంజ‌య్ రామ‌స్వామి ఎవ‌రు?

24 August 2022-12:00 PM

'సంజ‌య్ రామ‌స్వామి'.. ఈ పేరు తెలుగులో పాపుల‌ర్ చేసిన సినిమా 'గ‌జిని'. అందులో హీరో పేరు ఇదే. ఇప్పుడు ఇదే పేరు టైటిల్ అయ్యింది. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించే కొత్త సినిమాకి ఈ టైటిల్ ఫిక్స్ చేశారు.

 

'సినిమా చూపిస్త మావ‌', 'హ‌లో గురు ప్రేమ కోస‌మే', 'నేను లోక‌ల్‌' సినిమాల‌తో ఆక‌ట్టుకొన్నాడు త్రినాథ‌రావు న‌క్కిన. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ల‌ని బాగా తీస్తాడ‌ని పేరు తెచ్చుకొన్నాడు. ఇప్పుడు ర‌వితేజ‌తో 'ధ‌మాకా' రూపొందిస్తున్నాడు.

 

ర‌వితేజ రెండు పాత్ర‌ల్లో క‌నిపించే సినిమా ఇది. త్వ‌ర‌లోనే విడుదల కానుంది. ఇప్పుడు హ‌వీష్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. 'జీనియ‌స్‌', 'సెవెన్‌' చిత్రాల హీరో... హ‌వీష్‌. త‌న బ్యాన‌ర్‌లోనే త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేస్తున్నాడు. దీనికి 'సంజ‌య్ రామ‌స్వామి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'ధ‌మాకా' త‌ర‌వాత త్రినాథ‌రావు ప‌ట్టాలెక్కించే సినిమా ఇదే. ఇందులో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.

ALSO READ: పుష్ప కోసం రూ. 350 కోట్లా.. ఏమిటా ధైర్యం?