ENGLISH

విశ్వంభర లో త్రిష డబుల్ ట్రీట్

11 March 2024-14:03 PM

భోళాశంకర్ తరవాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ 'విశ్వంభర'.  ఈ మూవీని బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు. బింబిసార తో ఆకట్టుకున్న వశిష్ఠ పై మెగా ఫాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ చిరుకి మంచి హిట్ ని అందిస్తుంది అని.  ప్రజంట్ ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సిస్టర్ సెటిమెంట్ తో సాగే కథ తో చిరు అలరించనున్నారు. భోళా శంకర్ కూడా  సిస్టర్ సెంటి మెంట్ తోనే వచ్చింది. కానీ విశ్వంభర మూవీ చిరు కేరియర్లో సూపర్ హిట్ గా నిలిచిన హిట్లర్ తరహాలో ముగ్గురు సిస్టర్స్ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే వారి ఎంపిక కూడా జరిగింది. ఈషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి చిరుకి చెల్లెళ్లుగా నటిస్తున్నారు. రావు రమేశ్ విలన్‌గా నటిస్తున్నారు. ఇవి కాక ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ ఇంకొకటి వచ్చింది.


ఈ మూవీలో  చిరుకి జోడీగా నటిస్తున్న త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. అధికారికంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోయినా ఈ న్యూస్ సొషల్మీడియాలో హల్చల్ చేస్తోంది.  ఇప్పటికే త్రిష షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటోంది. త్రిష డ్యూయల్ రోల్ అనగానే  చిరు కూడా డ్యుయెల్ రోల్ చేస్తున్నారా? లేదంటే చేయాల్సిందే  అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. త్రిష డ్యూయెల్ రోల్ అనగానే ఈ సినిమాపై అంచనాలు ఇంకొంచెం పెరిగాయి. తప్పకుండా నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్ర అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు.
  
 
చిరు డబుల్ రోల్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అవన్నీ హిట్లే. ఇప్పుడు కూడా మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేయాలనీ ఫాన్స్ డిమాండ్ చేయటం గమనార్హం.  సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర 2025  సంక్రాంతి బరిలో దిగనున్నాడు.