ENGLISH

సల్మాన్ కంట్లో పడ్డ త్రిష

29 December 2023-15:00 PM

చెన్నై చంద్రం త్రిష ఫుల్ ఫామ్ లో ఉంది. కెరియర్ అయిపోతుంది అనుకున్న టైం లో మంచి హిట్స్ పడ్డాయి. మళ్ళీ యధావిధిగా సూపర్ స్టార్స్ తో జోడి కడుతోంది. పొన్నియన్ సెల్వన్ తో ఐశ్వర్య కంటే త్రిషకే మంచి నేమ్ వచ్చింది. దాంతో తమిళంలో కమల్ హాసన్, విజయ్, లాంటి స్టార్స్ తో, తెలుగులో మెగా స్టార్ చిరంజీవి, వెంకీ, నాగ్ లాంటి సీనియర్స్ తో యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. 


13 ఏళ్ల‌ క్రితం అక్షయ్ కుమార్ తో కట్టా మీఠా మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. త‌ర్వాత హిందీలో అవ‌కాశాలు వ‌చ్చినా సౌత్ లో బిజీగా ఉండ‌టంతో ఆ ఆఫ‌ర్స్‌ను తిర‌స్క‌రించింది. మళ్ళీ ఇన్నాళ్ళకి  స‌ల్మాన్ ఖాన్, పంజా ఫేమ్ విష్ణువ‌ర్ధ‌న్ కాంబోలో త్రిష హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్టు సమాచారం.


"ది బుల్" అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీకి క‌ర‌ణ్ జోహార్ ప్రొడ్యూస‌ర్‌. దాదాపు 25 ఏళ్ల తరవాత స‌ల్మాన్ ఖాన్‌, క‌ర‌ణ్ జోహార్ క‌లిసి సినిమా చేయటం, సౌత్ హీరోయిన్ ని తీసుకోవటం బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప్రజంట్ సౌత్ హీరోయిన్స్ కి నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. జవాన్ తో నయన్, యానిమల్ తో రష్మిక బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు.