ENGLISH

Vijay Deverakonda: విజయ్ కటౌట్ పై ట్రోల్స్ .. ఫ్యాన్స్ కౌంటర్లు

21 July 2022-12:00 PM

లైగర్ కోసం బోల్డ్ ప్రమోషన్స్ చేస్తున్నారు విజయ్ దేవర కొండ. ఇటివలే వంటిమీద నూలు పోగు లేకుండా కేవలం ఫ్లవర్ బొకే అడ్డుపెట్టుకొని వదిలిన ఫోటో వైరల్ అయింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 35 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌లో జరుగుతున్న నేపధ్యంలో సుమారు 75 అడుగుల విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు . జాతియ జెండాను కప్పుకున్న బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కటౌట్‌ ఇది.

 

ఈ కటౌట్ లో విజయ్ అండర్ వేర్ వేసుకుని జాతియ జెండాను కప్పుకున్న బాక్సర్‌గా కనిపించాడు. ఐతే దీనికి ట్రోల్ మొదలైయింది. దీనిపై కొంతమంది నెటిజన్స్‌ సెటైర్లు వేస్తున్నారు. అది కటౌట్‌లా లేదని.. కట్‌ డ్రాయర్‌ యాడ్‌లో ఉందని కామెంట్‌ చేస్తున్నారు.

 

దీనికి విజయ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ.. ఇలాంటి స్టిల్స్ ఇవ్వాలంటే దమ్ము కావాలి.. అది విజయ్ కి కావాల్సింత వుంది'' అని రిటార్ట్ ఇస్తున్నారు. ఎదేమైనా విజయ్ లైగర్ హాట్ టాపిక్ గా నిలిచిందిప్పుడు. ఈ మూవీ ఆగస్ట్‌ 25న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: లైగ‌ర్ ట్రైల‌ర్ రివ్యూ: ప‌ర్‌ఫెక్ట్ యాక్ష‌న్ ఫీస్ట్‌