ENGLISH

'ట‌క్ జ‌గ‌దీష్‌'లోని రెండో పాట 'కోలో కోల‌న్న కోలో' లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

13 March 2021-12:48 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 

టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్‌. త‌మ‌న్ సినిమాలో సంద‌ర్భానుసారం వ‌చ్చే ఒక పాట‌కు చ‌క్క‌ని మెలోడీ ట్యూన్స్ స‌మ‌కూర్చారు. "కోలో కోల‌న్న కోలో కొమ్మ‌లు కిల‌కిల న‌వ్వాలి.." అంటూ ప్ర‌సిద్ధ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ మోటివేష‌న‌ల్ సాంగ్‌ను అర్మాన్ మాలిక్‌, హ‌రిణి ఇవ్వ‌టూరి, శ్రీ‌కృష్ణ‌, త‌మ‌న్ క‌లిసి ఆల‌పించారు. నాని ఫ్యామిలీపై ఈ పాట‌ను చిత్రీక‌రించారు. కుటుంబ అనుబంధాల‌ను తెలియ‌జేస్తూ, చిన్న‌నాటి కేరింత‌ల్ని గుర్తుచేస్తూ, హీరోను మోటివేట్ చేస్తూ ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఈ పాట‌ను ఆల‌పిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

 

ఏప్రిల్ 23న 'ట‌క్ జ‌గ‌దీష్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.

ALSO READ: మెహ‌రీన్ నిశ్చితార్థం అయిపోయింది.. ఇక పెళ్లే!