ENGLISH

థియేట‌ర్లకు గ్రీన్ సిగ్న‌ల్‌

30 September 2020-19:07 PM

సినీ ప్రియుల‌కు శుభ‌వార్త‌. లాక్ డౌన్ కార‌ణంగా మూత‌బ‌డిన థియేట‌ర్లు త్వ‌ర‌లో తెర‌చుకోబోతున్నాయి. అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్ల‌కు మిన‌హాయింపు ల‌భించింది. కేంద్రం తాజాగా విడుద‌ల చేసిన అన్ లాక్ 5 మార్గ‌ద‌ర్శ‌కాల‌లో థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చారు. అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్సులు తెర‌చుకోవొచ్చ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే.. 50 శాతం సిట్టింగ్‌కి మాత్ర‌మే ప‌ర్మిష‌న్లు ఇచ్చారు. సిట్టింగ్ సిస్ట‌మ్ ఎలా ఉండాలి? టికెట్ల విక్ర‌యం ఎలా జ‌ర‌గాలి అనే విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సివుంది.

 

అన్ లాక్ 5 లో భాగంగా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు వ‌స్తాయ‌ని చిత్ర‌సీమ ముందే ఊహించింది. అందుకు త‌గ్గ‌ట్టుగా థియేట‌ర్ య‌జ‌మానులు సిద్ధం అవుతున్నారు. సిట్టింగ్ , టికెటింగ్ విష‌యాల్లో ఓ క్లారిటీ వ‌స్తే స‌రిపోతుంది. అయితే అక్టోబ‌రు 15 నుంచే సినిమాలు వ‌స్తాయా? లేదంటే నిర్మాత‌లు మ‌రింత స‌మ‌యం తీసుకుంటారా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికీ ఓటీటీలో విడుద‌లైన కొన్ని సినిమాల్ని థియేట‌ర్ల‌లోకి విడుద‌ల చేసి ప‌రిస్థితిని గ‌మ‌నించాల‌ని కొంత‌మంది నిర్మాత‌లు భావిస్తున్నారు.

ALSO READ: అలీ తో సౌంద‌ర్య ఎందుకు న‌టించ‌లేదు?