ENGLISH

మహిళల కోసం మెగా కోడలు మెగా ఆఫర్

03 September 2024-21:15 PM

ఉపాసన కేవలం మెగా ఇంటి కోడలుగా ఉండిపోలేదు. రామ్ చరణ్ భార్యగా గుర్తింపు పొందటం కాకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్య కర్తగా, చాలా రకాల పాత్రల్లో సక్సెస్ ఫుల్ గా జర్నీ చేస్తోంది ఉపాసన. అపోలోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, అపోలో సేవల్ని విస్తరిస్తూ బిజినెస్ విమెన్ గా నంబర్ వన్  స్థానంలో కొనసాగుతోంది. ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబానికి కూడా టైం కేటాయిస్తూ, మన ట్రెడిషన్ ని ఫాలో అవుతూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.  


తనలాగే పది మంది ఎదగాలని ఆలోచనతో ఉపాసన మహిళలకి చేయూత ఇవ్వటానికే ముందుకు వచ్చింది. మహిలళకి ఆర్ధిక స్వావలంభన అవసరమని, వారిని ఎంకరేజ్ చేసేందుకు మీరు కొత్త బిజినెస్ లు పెట్టండి, నేను పెట్టుబడి పెడతా అని అనౌన్స్ చేసింది. తన అత్తమ్మ సురేఖతో కూడా 'అత్తమ్మాస్ కిచెన్ ' పెట్టించి, ప్రమోట్ చేసి మంచి ఆదరణ పొందేలా చేసింది ఉపాసన. నిజానికి సురేఖ ఉన్న స్థాయికి వారికి ఫుడ్ బిజినెస్ అవసరం లేదు. కానీ ప్రతి మహిళకి ఎదో ఒకటి సాదించామని సంతృప్తి కోసం ఇలా చేశారు. ఇపుడు మిగతా మహిళల కోసం ఆలోచించి ఇలాంటి వినూత్న కార్య క్రమం చేపట్టింది ఉపాసన.                


తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఉపాసన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ 'హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకుంటున్న యువ మహిళల కోసం చూస్తున్నానని, నేను మీ కో ఫౌండర్ అవుతాను, పార్ట్నర్స్ గా ముందుకు వెళ్దాం. ఇండియాలో హెల్త్ కేర్ సిస్టంని చేంజ్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం' అని తెలిపింది ఉపాసన. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసి 'హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా? మహిళలు ఎదిగేందుకు, అభివృద్ధి చెందేందుకు వ్యవస్థని నిర్మించడానికి నాతో చేతులు కలపండి. మీ బిజినెస్ పర్పస్, మీ బిజినెస్ ఎవరికి మేలు, అది మన ప్లానెట్ కి ఎలాంటి పాజిటివిటీని ఇస్తుంది, కో ఫౌండర్ గా నన్నే ఎందుకు కోరుకుంటున్నారు మొత్తం డిటైల్స్ ని [email protected] వెబ్ సైట్ లో సబ్మిట్ చేయమని తెలిపింది.