ENGLISH

'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌'కి మెగా సపోర్ట్‌

19 July 2018-13:48 PM

మంచు లక్ష్మీ ప్రసన్న ఓ పక్క వెండితెరపై సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూనే, మరోవైపు బుల్లితెరపైనా తన సత్తా చాటుతోంది. ఇకపోతే తాజాగా మంచు లక్ష్మీ నటిస్తున్న చిత్రం 'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌'. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. రేపు ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సరికొత్తగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. 

ఇప్పటికే చాలా మంది ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. చాలామంది అంటే వారిలో అందరూ సెలబ్రిటీల భార్యలే వుండడం విశేషం. టైటిల్‌కి తగ్గట్లుగా 'వైఫ్‌ ఆఫ్‌ పలానా హీరో' ఈ సినిమాకి స్పెషల్‌గా ప్రమోషన్‌ చేశారు. తమిళ హీరో సూర్య భార్య జ్యోతిక, నేచురల్‌ స్టార్‌ నాని భార్య తదితరులు సోషల్‌ మీడియాలో 'వైప్‌ ఆఫ్‌ రామ్‌'కి వీడియో బైట్స్‌ రూపంలో తమదైన శైలిలో ప్రమోషన్స్‌ నిర్వహించారు. 

తాజాగా మరో వీడియో బైట్‌ సోషల్‌ మీడియాలో స్పెషల్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో బైట్‌ మరెవరిదో కాదు, వైఫ్‌ ఆప్‌ రామ్‌ చరణ్‌. ఉపాసన. 'వైఫ్‌ ఆప్‌ రామ్‌' ఓ స్పెషల్‌ థ్రిల్లర్‌ మూవీ అనీ, తప్పకుండా అందరూ చూడాలని ఆమె ఆ వీడియో బైట్‌లో చెప్పింది. ఓ డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్‌ ఎలకంటి దర్శకత్వం వహిస్తున్నారు. 

మంచు లక్ష్మీ దీక్ష పాత్రలో విభిన్నంగా ఆకట్టుకోనుందట. విడుదలకు మందే ఈ సినిమా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలు దక్కించుకుంటోంది. చూడాలి మరి ఈ సరికొత్త సబ్జెక్ట్‌తో మంచు వారమ్మాయి ఎలా ఆకట్టుకుంటుందో.

ALSO READ: బిగ్ బాస్ సభ్యులకి, వీక్షకులకి షాక్ ఇచ్చిన ప్రదీప్