ENGLISH

సోమ‌వారం టెస్ట్ పాసైపోయిన 'ఉప్పెన‌'

16 February 2021-12:00 PM

ప్ర‌తీ సినిమాకీ వీకెండ్ చాలా కీల‌కం. శుక్ర‌, శ‌ని, ఆదివారాల వ‌సూళ్ల‌ని బ‌ట్టి... ఆ సినిమా హిట్టా? ఫ‌్లాపా? అనేది తేల్చేస్తుంటారు ట్రేడ్ నిపుణులు. అయితే... కొన్ని సినిమాల‌కు సోమ‌వారం ప‌రీక్ష ఎదుర‌వుతుంటుంది. తొలి మూడు రోజులు వ‌సూళ్లు బాగున్నా, సోమ‌వారం నుంచి అనూహ్యంగా డ్రాప్ అవుతాయి. సోమ‌వారం వ‌సూళ్లు ప‌డిపోయాయంటే... ఆసినిమా మ‌ళ్లీ తేరుకోవ‌డం క‌ష్టం. సూప‌ర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు యావ‌రేజులుగా, యావ‌రేజ్ గా మారాల్సిన సినిమా బిలో యావ‌రేజ్ గా నిలిచాయంటే... సోమ‌వారం టెస్ట్ పాస‌వ్వ‌లేద‌నే లెక్క‌. `ఉప్పెన‌`కీ ఇలాంటి ప‌రీక్ష ఎదురైంది.

 

తొలి మూడు రోజుల్లో 30 కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమా.. సోమ‌వారం నిల‌బ‌డుతుందా? లేదా? అని ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే.. సోమ‌వారం టెస్టులో ఉప్పెన పాసైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల‌లో క‌లిపి దాదాపు 4 కోట్లు సాధించింది. ఇది మంచి మొత్త‌మే. సీ సెంటర్ల‌లో ఇంకా ఉప్పెన హౌస్ ఫుల్ వ‌సూళ్ల‌తోనే న‌డుస్తోంది. కాబ‌ట్టి... ఉప్పెన‌ని హిట్ లిస్టులో చేర్చేయొచ్చు.

ALSO READ: ప‌వ‌న్‌తో పూజా హెగ్డే?