ENGLISH

ఫస్ట్ డే ఉప్పెన : వైష్ణవ్ తేజ్ వెరీ వెరీ స్పెషల్

13 February 2021-13:05 PM

సినిమా పై హైప్ పెంచడం ఎందుకు మంచిందో ఉప్పెన మొదటి రోజు వసుళ్ళూ చూస్తే అర్ధమౌతుంది. మెగా క్యాంప్ నుండి వచ్చిన కొత్త హీరో, సుకుమార్ రైటింగ్స్, శిష్యుడే దర్శకుడు.. దేవిశ్రీ ఇచ్చిన నీకళ్ళు నీలి సముద్రం లాంటి చార్ట్ బస్టర్ పాట , విజయ సేతుపతి లాంటి వండర్ ఫుల్ యాక్టర్, మెగా ప్రమోషన్స్ ... ఇవన్నీ ఉప్పెనని ఆకాశానికి ఎత్తాయి. సినిమా ఎలా వుందో పక్కన పెడితే .. ఈ హైప్ కారణంగా ఎంట్రీ లోనే అద్భుతమైన రికార్డ్ ఒకటి వైష్ణవ్ తేజ్ సొంతమైయింది. తొలిరోజు ఈ సినిమా దాదాపు  ప్రపంచవ్యాప్తంగా 10.42 కోట్ల వసుళ్ళూ రాబట్టింది.    


తొలి రోజు కలెక్షన్లు ఇలా వున్నాయి

నైజం 3.08 Cr
వైజాగ్  1.43 Cr
ఈస్ట్  0.98 Cr
వెస్ట్   0.81 Cr
కృష్ణ  0.62 Cr
గుంటూరు 0.65 Cr
నెల్లూరు  0.35 Cr
(ఆంధ్ర  4.87) Cr
సీడెడ్  1.35 Cr
ఓవర్ సీస్ 34 L
కర్ణాటక. 52 L
తమిళ్ నాడు. 16 L
ఆర్ఓ. . ఐ. 10 L

మొత్తం 10.42 Cr

ఒక కొత్త హీరో సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే ఓ రికార్డ్ అనే చెప్పాలి. అప్పటి లెక్కల ప్రకారం రామ్ చరణ్ చిరుత సినిమా మొదటి రోజు 3.75 కోట్లు, వరుణ్ తేజ్ ముకుందా 3.35 కోట్లు , సాయి తేజ్ పిల్లా నీవు లేని జీవితం..  2.3 కోట్లు.. తొలిరోజు వసుళ్ళూ గా వున్నాయి. ఇప్పుడీ మెగా వరుసలో వైష్ణవ్ తేజ్ మాత్రం స్పెషల్ రికార్డ్ ని సొంతం చేసుకున్నట్టే.

ALSO READ: ఎన్టీఆర్‌తో ఉప్పెన హీరోయిన్‌?