ENGLISH

తొలి సినిమాకి.. ఇంత బిజినెస్సా..?

10 February 2021-09:03 AM

ఆ హీరో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. హీరోయిన్ కీ అంతే. ద‌ర్శ‌కుడికి అదే తొలి సినిమా. కాక‌పోతే... ఈ ముగ్గురూ క‌లిసి చేసిన సినిమాకి ఏకంగా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇదీ... `ఉప్పెన` క్రేజ్‌. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. కృతి శెట్టి క‌థానాయిక‌. బుచ్చి బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఈ సినిమాకి ఏకంగా 20 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌డం... టాలీవుడ్ కి షాక్ కి గురి చేస్తోంది.


ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్ వివ‌రాలు:


నైజాం 6.0 cr
సీడెడ్ 3.0 cr
ఉత్తరాంధ్ర 10.0 cr
ఏపీ+తెలంగాణ (టోటల్) 19.0 cr
ఓవర్సీస్ + రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 cr
వరల్డ్ వైడ్ టోటల్ 20.5 cr


ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 22 నుంచి 25 కోట్ల వ‌ర‌కూ తెచ్చుకోవాలి. హిట్ టాక్ వ‌స్తే.. ఇంత మొత్తాన్ని సంపాదించ‌డం తేలికే. అటూ ఇటూ అయితే మాత్రం మైత్రీ భారీ న‌ష్టాల్ని చ‌వి చూడాల్సివ‌స్తుంది. ఈ సినిమాకి దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని టాక్‌. శాటిలైట్‌, డిజిట‌ల్ రూపంలో.. మంచి రేట్లే వ‌చ్చాయి. 

ALSO READ: కొత్త‌మ్మాయిని ప‌ట్టేసిన నాగ్‌