ENGLISH

'ఉప్పెన‌'కు సీక్వెల్ ఉందా?

21 October 2021-14:35 PM

ఈ యేడాది టాలీవుడ్ పెద్ద కుదుపున‌కు లోనైంది. మూడు నెల‌లు సినిమాల్లేకుండా పోయాయి. ఆ త‌ర‌వాత‌. కొత్త సినిమాలు వ‌చ్చినా, స‌రైన హిట్లు ప‌డ‌లేదు. అయితే 2021లోనే `ఉప్పెన‌` పెద్ద హిట్ గా నిలిచింది. కొత్త న‌టీన‌టులు, ద‌ర్శ‌కుడితో ఈసినిమా 50 కోట్లు కొట్టింది. మైత్రీ మూవీస్ కి అత్య‌ధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో `ఉప్పెన‌` ఒక‌టి. ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు పేరు మార్మోగిపోయింది. ఎన్టీఆర్ తో బుచ్చి ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.కానీ అది వీలు కాలేదు. ఆ త‌ర‌వాత వైష్ణ‌వ్ తేజ్ తోనే బుచ్చి సినిమా చేయ‌బోతున్నాడ‌ని అన్నారు. దానిపై కూడా క్లారిటీ లేదు.

 

కాక‌పోతే... వైష్ణ‌వ్ తేజ్ తో బుచ్చి `ఉప్పెన 2` తీయ‌బోతున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. `ఉప్పెన‌` క‌థ ఎక్క‌డైతే ఆగిందో, అక్క‌డి నుంచి పార్ట్ 2 మొద‌ల‌వుతుంద‌ట‌. ఓ ర‌కంగా ఇది కూడా సుకుమార్ ఐడియానే అని తెలుస్తోంది. ఉప్పెన అంత పెద్ద హిట్టు కొట్ట‌డం వెనుక‌.. సుకుమార్ హ‌స్తం ఉంది. త‌నే.. `ఉప్పెన 2` తీస్తే బాగుంటుంద‌ని ఐడియా ఇచ్చాడ‌ట‌. అంతే కాదు... క‌థ‌లో ఏముండాలో కూడా స‌ల‌హా అందించాడ‌ట‌. అందుకే గురువుని మ‌రోసారి ఫాలో అయిపోతున్నాడు మ‌న బుచ్చిబాబు. సో.. ఉప్పెన సీక్వెల్ కి రెడీ గా ఉండాల్సిందే.

ALSO READ: 'పుష్ష‌'ని నాని లైట్ తీసుకున్నాడా?