ENGLISH

Kantara 2: ‘కాంతార’ 2 లో బాస్ బ్యూటీ

13 February 2023-12:00 PM

గతేడాది విడుదలైన ‘కాంతార’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన దగ్గరి నుంచి సినీ ప్రియులు దీని సీక్వెల్‌ కోసం ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ తాజాగా ఈ ప్రాజెక్ట్ లో వాల్తేరు వీరయ్యలో బ్యూటీ చేరింది. బాస్ పార్టీకి డ్యాన్స్ లతో అదరగొట్టిన ఊర్వశి రౌతేలా కాంతార ప్రీక్వెల్ లో సందడి చేయబోతుంది.

 

రిషబ్‌ శెట్టితో కలిసి ‘కాంతార2’లో తెర పంచుకోనున్నట్లు తెపిలింది ఊర్వశి. ఈ మేరకు రిషబ్‌ శెట్టి తో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది . ‘‘కాంతార 2 లోడింగ్‌’’ అంటూ ఆ ఫొటోకు కామెంట్ కూడా జోడించింది. ‘ తొలి భాగం కథ ఎక్కడైతే మొదలైందో.. దానికి ముందు ఏం జరిగిందన్నది ఇందులో చూపించనున్నారు. జూన్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు