ENGLISH

'సలార్' కోసం మ‌రో బాలీవుడ్ భామ‌

06 July 2021-14:00 PM

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న మ‌రో పాన్ ఇండియా చిత్రం `స‌లార్‌`. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో క‌థానాయిక గా శ్రుతి హాస‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి మ‌రో బాలీవుడ్ భామ చేరింది. త‌నే.. వాణీక‌పూర్‌. ఈ చిత్రంలో మ‌రో క‌థానాయిక‌కీ స్థానం ఉంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె కోసం.. చిత్ర‌బృందం ఎప్ప‌టి నుంచో అన్వేషిస్తోంది. ఇప్పుడు ఆ అన్వేష‌ణ‌కు తెర‌పడింది.

 

`స‌లార్‌`లోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌ల‌లో... వాణీక‌పూర్ క‌నిపించ‌బోతోంద‌ట‌. ఆమె పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంద‌ని, ఈ క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర అవుతుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. త్వ‌ర‌లోనే.. వాణీ సెట్స్‌లోకి అడుగుపెట్ట‌బోతోంద‌ని స‌మాచారం. `స‌లార్‌` చిత్రీక‌ర‌ణ‌ని వీలైనంత వేగ‌వంతం చేసి, త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. త్వ‌ర‌లోనే.. కొత్త షెడ్యూల్ కి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు.

ALSO READ: ఈ మిష‌న్‌లోకి తాప్సి వ‌చ్చేసింది గా!