ENGLISH

మెగా మేనల్లుడి బ్యాక్‌ టు బ్యాక్‌ విక్టరీస్‌

10 November 2020-11:00 AM

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తొలి సినిమా ‘ఉప్పెన’ రిలీజ్‌కి కరోనా అడ్డంకిగా మారిన విషయం విదితమే. నిజానికి సినిమా నిర్మాణం కూడా చాలా ఆలస్యంగా జరిగింది. రిలీజ్‌ డేట్‌ కన్‌ఫాం అయ్యిందనేలోపు, కరోనా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. ఓటీటీలో సినిమాని రిలీజ్‌ చేసెయ్యడానికి ప్రయత్నించారుగానీ, ఎక్కడో వ్యవహారం తేడా కొట్టేసింది. ఇదిలా వుంటే, త్వరలో ‘ఉప్పెన’ సినిమాని విడుదల చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

 

మరోపక్క, పంజా వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తోన్న మరో సినిమా కూడా రెడీ అయిపోతోంది. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని సంక్రాంతికే బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఉప్పెన’ ముందు రిలీజ్‌ అవుతుందా.? లేదంటే, ఈ సినిమా ముందు రిలీజ్‌ అవుతుందా.? అన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. వైష్ణవ్‌ తేజ్‌ సోదరుడు సాయి ధరం తేజ్‌ హీరోగా నటించిన తొలి సినిమా కంటే ముందు రెండో సినిమా విడుదలయ్యింది.

 

అదే సెంటిమెంట్‌ ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌ విషయంలోనూ వర్కవుట్‌ అవుతుందేమో.! ఇదిలా వుంటే, హీరోగా ఎంట్రీ ఇస్తూనే పవర్‌ ప్యాక్డ్‌ మూవీస్‌ని పంజా వైష్ణవ్‌ తేజ్‌ సొంతం చేసుకున్నాడనే చర్చ సర్వత్రా జరుగుతున్నాయి. రెండూ కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలేననీ, రెండూ బ్లాక్‌ బస్టర్‌ విజయాలు సాధిస్తాయనీ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. ‘ఉప్పెన’ విషయానికొస్తే, ఆడియో సింగిల్స్‌ రికార్డు స్థాయిలో వ్యూస్‌ కొల్లగొడుతున్న విషయం విదితమే.

ALSO READ: చిరుకి క‌రోనా.. మరి వాళ్ల ప‌రిస్థితేంటి?