ENGLISH

శేఖ‌ర్ క‌మ్ముల‌తో మెగా హీరో?

04 April 2021-15:10 PM

హీరోల్ని బ‌ట్టి క‌థ‌లు అని కాకుండా, క‌థ‌ల్ని బ‌ట్టి హీరోలు అనే పద్ధ‌తి ఫాలో అవుతాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అందుకే ఆయ‌న క‌థ‌ల్లో హీరోలు అలా సెట్ట‌యిపోతుంటారు. ప్ర‌స్తుతం `ల‌వ్ స్టోరీ`కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈనెల 16న విడుద‌ల కానుంది. శేఖ‌ర్ క‌మ్ముల త‌దుప‌రి సినిమాపై కూడా భారీగా చ‌ర్చ సాగుతోంది. వెంక‌టేష్ కి శేఖ‌ర్ క‌మ్ముల క‌థ చెప్పార‌ని, వెంకీ కూడా ఓకే అనేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు మ‌రో హీరో పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. తనే... వైష్ణ‌వ్ తేజ్‌.

 

ఉప్పెన‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణ‌వ్‌. ఆ సినిమా ఏకంగా 50 కోట్ల మైలు రాయిని అందుకుంది. ఇప్పుడు త‌న చేతిలో మ‌రో రెండు సినిమాలున్నాయి. శేఖ‌ర్ క‌మ్ముల కూడా... త‌న క‌థ‌లో వైష్ణ‌వ్ అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నాడ‌ట‌. అందుకే ఈ కాంబో సెట్ట‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. క‌థానాయిక‌గా `గ్యాంగ్ లీడ‌ర్` ఫేమ్‌.. ప్రియాంకా మోహ‌న్ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. ల‌వ్ స్టోరీ రిలీజ్ అయ్యాకే.. ఈ కాంబోపై ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ALSO READ: అక్ష‌య్‌కుమార్ కు క‌రోనా... బాలీవుడ్ లో టెన్ష‌న్‌