ENGLISH

లెక్క‌లు చెప్పొద్దంటూ దిల్ రాజు వార్నింగ్‌

12 April 2021-12:00 PM

ఓ స్టార్ హీరో సినిమా వ‌చ్చిందంటేనే తొలి షో నుంచే `రికార్డుల‌` ప‌బ్లిసిటీ స్టంట్ మొద‌లైపోతుంది. తొలి రోజు ఇంత చేశాం, ఈ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాం.. అని పోస్ట‌ర్లు వేసుకుంటారు. అయితే `వ‌కీల్ సాబ్`కి ఈ హ‌డావుడి ఏం క‌నిపించ‌లేదు. భ‌విష్య‌త్తులోనూ క‌నిపించ‌దు కూడా. వ‌కీల్ సాబ్ తొలి రోజు ఎంత‌? రెండో రోజు ఎంత‌? వీకెండ్ ఎంత‌? అమెరికాలో ఎంత‌? అనే లెక్క‌లేవీ చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. దానికి కార‌ణం.. దిల్ రాజు వైఖ‌రే అని టాక్‌.

 

ఈసినిమాని సంబంధించిన వ‌సూళ్ల లెక్క‌లేవీ బ‌య‌ట‌కు ఇవ్వొద్ద‌ని... త‌న బృందానికి దిల్ రాజు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ లెక్క‌లేవీ బ‌య‌ట‌కు రాలేదు. కానీ ప‌వ‌న్ కెరీర్‌లోనే ఇది పెద్ద హిట్ కాబోతోంద‌న్న సంకేతాల్ని దిల్ రాజు పంపించ‌డంలో స‌ఫ‌లం అయ్యాడు. తొలి రెండు రోజుల్లోనే ఈసినిమా 50 కోట్లు దాటేసింది. మ‌రో 50 కోట్లు అవ‌లీల‌గా దాటే ఆస్కారం ఉంది. వంద కోట్ల‌యిన త‌ర‌వాత‌.... ఆ విష‌యాన్ని అధికారికంగా చెప్పినా చెప్పొచ్చు. నిజానికి... వ‌సూళ్ల గురించి ప‌బ్లిసిటీ స్టంట్ చేయ‌క‌పోవ‌డం మంచి ప‌రిణామం. హీరోల అభిమానుల మ‌ధ్య‌... గొడ‌వ‌లు, ఈగో ఇష్యూలు రాకుండా ఉంటాయి. మిగిలిన హీరోలూ ఇదే ఫాలో అయితే బాగుంటుంది.