ENGLISH

వ‌కీల్ సాబ్‌.. థ్యాంక్స్ టూ పూరీ

09 April 2021-17:18 PM

నువ్వు నందా అయితే నేను బ‌ద్రీ బ‌ద్రీనాథ్ అంటూ ప్ర‌కాష్ రాజ్ పై సై అంటే సై అంటూ యుద్ధానికి దిగిన బ‌ద్రి గుర్తున్నాడుక‌దా? ఆ సినిమాని పీక్స్ కి తీసుకెళ్లిపోయిన సీన్ అది. ప‌వ‌న్ - ప్ర‌కాష్‌రాజ్ ఇద్ద‌రూ త‌ల‌ప‌డితే ఎలా ఉంటుందో ఆ సినిమాతో రుజువైంది. దాదాపు 20 ఏళ్ల త‌ర‌వాత‌.. ప‌వ‌న్ - ప్ర‌కాష్ రాజ్ మ‌ళ్లీ ఢీ కొట్టుకున్నారు. ఈసారి కోర్టు రూములో.

 

`నందా..... జీ` అంటూ ప‌వ‌న్ , ప్ర‌కాష్ రాజ్ పై విరుచుకుప‌డిపోయిన దృశ్యాలు.. ఇప్పుడు `వ‌కీల్ సాబ్‌`లోనూ హీటు పుట్టిస్తున్నాయి. `వ‌కీల్ సాబ్` ఓ కోర్టు రూమ్ డ్రామా. అక్క‌డ స‌న్నివేశాలు పండితే సినిమా హిట్టే. అందుకే ప్ర‌కాష్‌రాజ్ ని రంగంలోకి దింపింది చిత్ర‌బృందం. ఆయ‌న‌కు `నందా` అనే పేరు పెట్ట‌డం వెనుక కూడా... `బ‌ద్రి`నే స్ఫూర్తి. తెర‌పై బ‌ద్రి- నందాల పోరాటం మ‌రోసారి చూపించొచ్చ‌న్న ఆలోచ‌న‌. ఇది బాగా పేలింది.

 

కోర్టు రూమ్ లో ఇద్ద‌రూ చెల‌రేగిపోయారు. వాళ్ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఇప్పుడు ఆ స‌న్నివేశాలే వ‌కీల్ సాబ్ కి ప్రాణం పోశాయి. 'వకీల్ సాబ్ ఫెస్టివల్ బిగిన్స్.. థాంక్యూ పూరీ జగన్నాథ్.. బద్రి అండ్ నంద కాంబినేషన్ క్రియేట్ చేసినందుకు. అదే కాంబినేషన్ మరోసారి థియేటర్లో దుమ్ము రేపుతోంది' అంటూ ప్ర‌కాష్ రాజ్ సైతం ట్వీట్ చేశాడు. కాబ‌ట్టి.. ఈ హిట్ లో పూరి వాటా కూడా ఉంద‌న్న‌మాట‌.

ALSO READ: 'వకీల్ సాబ్' మూవీ రివ్యూ & రేటింగ్!