ENGLISH

వ‌ర‌ల‌క్ష్మి న‌యావ‌తారం

20 October 2020-09:34 AM

శ‌ర‌త్ కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌. న‌టిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. ఎక్కువ‌గా నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తోంది. ఇప్పుడు మ‌రో కొత్త అవతారం ఎత్త‌బోతోంది. ద‌ర్శ‌కురాలిగా మెగాఫోన్ ప‌ట్టుకోబోతోంది. `క‌న్న‌మూచి` అనే పేరుతో ఓ చిత్రాన్ని ప్ర‌క‌టించింది వ‌ర‌ల‌క్ష్మి. ఈ సినిమాతో ద‌ర్శ‌కురాలిగా మారుతున్న‌ట్టు, కొత్త ప్ర‌యాణానికి అభిమానుల ఆశిస్సులు కావాలంటూ ట్వీట్ చేసింది. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు నేప‌థ్యంలో ఈ క‌థ ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

 

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే అవకాశం ఉంది. ఇందులో వ‌ర‌ల‌క్ష్మి న‌టిస్తుందా, లేదా? అనేది తెలియాల్సివుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా త‌నే అవ్వ‌డం విశేషం. ఓ ప్ర‌ముఖ క‌థానాయిక ఈసినిమాలో న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం అందుతోంది. పూర్తి వివ‌రాలు తెలియాలంటే... ఇంకొంత కాలం ఆగాలి. నటీమ‌ణులు ద‌ర్శ‌కురాలిగా అవ‌కాశం ఎత్త‌డం చాలా అరుదు. అందులో స‌క్సెస్ అయిన‌వాళ్లూ త‌క్కువే. మ‌రి వ‌ర‌లక్ష్మి జాత‌కం ఎలా వుందో?
 

kannamoochi

ALSO READ: చిత్ర‌సీమ నెత్తిన మ‌రో 'పిడుగు'