ENGLISH

టాలీవుడ్ లేడీ విలన్ పెళ్లి

03 March 2024-17:36 PM

శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ కొద్దీ కాలంలోనే తండ్రిని మించి పేరు, అవకాశాలు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, భాషల్లో  తన నటనతో ప్రేక్షకులకి బాగా చేరువ అయ్యింది.   ప్రజంట్ సినిమా స్టార్స్ పెళ్లిళ్ల సందడి మొదలయ్యింది. అన్నివుడ్ లకి  చెందిన హీరో హీరోయిన్స్ వివాహబంధం లోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నాని ని వివాహం చేసుకుంది. ఈ ఇయర్ హనుమాన్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న వరలక్ష్మి కూడా పెళ్లి చేసుకోబోతోంది. రీసెంట్ గా నిశ్చితార్థం కూడా జరిగింది.


మార్చ్ 1న వరలక్ష్మి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకి సంబధించిన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈమె చేసుకోబోయే 'నికోలాయి సచ్ దేవ్' ఒక గ్యాలరిస్ట్.  ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ఉంటారని తెలుస్తోంది. ముంబైలోని ప్రముఖ బిజినెస్ మేన్ లలో ఒకరు. 14 ఏళ్ల నుంచి వరలక్ష్మి నికోలాయ్ మధ్య పరిచయం ఉందని ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని తెలుస్తోంది. వరలక్ష్మి కి కాబోయే భర్త సినీ ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి కావటం గమనార్హం.


గత కొంతకాలంగా విశాల్ తో  వరలక్ష్మి ప్రేమలో ఉందని, తండ్రికి ఇష్టం లేకపోవడం వల్ల వీరివురు  పెళ్లి చేసుకోవటం లేదని వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ మొత్తానికి వరలక్ష్మి కూడా పెళ్లి పీటలెక్కుతోంది. నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. కానీ  పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేస్తారని సమాచారం.