ENGLISH

ఓవ‌ర్సీస్‌లో రివ‌ర్స్ అయిన రిజ‌ల్ట్‌

01 November 2021-16:43 PM

ఈ శుక్ర‌వారం వ‌రుడు కావ‌లెను, రొమాంటిక్ చిత్రాలు విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. తెలుగురాష్ట్రాల‌లో... వ‌రుడు కావ‌లెను కంటే, రొమాంటిక్ కే ఎక్కువ వ‌సూళ్లు ఉన్నాయి. ఎందుకంటే రొమాంటిక్ మాస్ సినిమా కాబ‌ట్టి. కుర్రాళ్ల‌కు నచ్చే విష‌యాలు ఇందులో ఉన్నాయి కాబ‌ట్టి, రొమాంటిక్ కి ఎక్కువ టికెట్లు తెగుతున్నాయి. అయితే.. ఓవ‌ర్సీస్‌లో మాత్రం ఈ రిజ‌ల్ట్ రివ‌ర్స్ అయ్యింది. అక్క‌డ‌.. వ‌రుడు కావ‌లెనుకి మంచి వ‌సూళ్లు వ‌స్తుంటే, రొమాంటిక్ పూర్తిగా ప‌డిపోయింది.

 

వ‌రుడు కావ‌లెను ఈ వీకెండ్ లో దాదాపు 200K డాలర్స్ వ‌సూలు చేసిన‌ట్టు అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాలు లెక్క గ‌ట్టాయి. గురువారం $ 44K - శుక్రవారం $ 62K - శనివారం $ 68K - ఆదివారం $ 25K వసూళ్ళు సాధించినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కి మాత్రం ఇక్క‌డ అస్స‌లు వ‌సూళ్లు లేవు. ఓర‌కంగా.. రొమాంటిక్ ఓవ‌ర్సీస్ లో డిజాస్ట‌ర్ గా తేలిపోయింది. ఈ సినిమా తొలి వారంలో కేవ‌లం 10K డాల‌ర్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. మాస్ సినిమాలు ఓవ‌ర్సీస్ వాళ్ల‌కు పెద్ద‌గా ఎక్క‌వ‌న్న సంగ‌తి రొమాంటిక్ తో మ‌రోసారి నిరూపిత‌మైంది.

ALSO READ: నాగ‌శౌర్య తండ్రికి పోలీసుల నోటీసులు