ENGLISH

చిరు, చ‌ర‌ణ్ ఫ్లాపైన చోట‌.. వ‌రుణ్ హిట్ కొడ‌తాడా?

07 July 2021-11:09 AM

మెగా కాంపౌండ్ నుంచి చాలామంది హీరోలొచ్చారు. చిరంజీవి నుంచి.. ఇప్ప‌టి క‌ల్యాణ్ దేవ్ వ‌ర‌కూ ఆ ప్ర‌స్థానం తెలుగు ప్రేక్ష‌కులు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. వీళ్ల‌లో చాలామంది బాలీవుడ్ పై ఆశ‌లు పెంచుకున్న‌వాళ్లే. చిరు బాలీవుడ్ లో `ప్ర‌తిబంధ్‌`, `ఆజ్ కా గుండా రాజ్‌` సినిమాలు చేశాడు. రామ్ చ‌ర‌ణ్ సైతం తండ్రిని ఫాలో అవుతూ `తుఫాన్‌` చేశాడు. అయితే ఇవేమీ స‌రైన ఫ‌లితాల్ని ఇవ్వ‌లేక‌పోయాయి. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ సైతం.. బాలీవుడ్ క‌ల‌లు కంటున్నాడు.

 

త్వ‌ర‌లోనే వ‌రుణ్ ఓ బాలీవుడ్ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న‌ది టాలీవుడ్ స‌మాచారం. సోనీ పిక్చ‌ర్స్ సంస్థ వ‌రుణ్ తేజ్ తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యింద‌ని, ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో క‌థ‌ని సైతం వినిపించింద‌ని టాక్‌. వ‌రుణ్ కూడా ఈ సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ట‌. ఇది వ‌రుణ్ చేయ‌బోయే తొలి హిందీ సినిమా. తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్క‌బోతోంది. ప్ర‌స్తుతం వ‌ర‌ణ్‌తేజ్ హీరోగా `గని` తెర‌కెక్కుతోంది. అది పూర్త‌యిన వెంట‌నే.. ఈ హిందీ సినిమా మొద‌ల‌వుతుంది. చిరు, చ‌ర‌ణ్‌ల వ‌ల్ల సాధ్యం కానిది.. వ‌రుణ్ చేసి చూపిస్తాడేమో చూడాలి.

ALSO READ: మ‌ళ్లీ కెలికిన ప్ర‌కాష్ రాజ్‌!