ENGLISH

Veera Simha Reddy Review: 'వీరసింహారెడ్డి' మూవీ రివ్యూ & రేటింగ్!

12 January 2023-14:18 PM

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ తదితరులు
దర్శకుడు : గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్
సంగీత దర్శకులు: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి


రేటింగ్ : 2.5/5


ఈ సంక్రాంతి చాలా స్పెషల్. తెలుగు చిత్ర పరిశ్రమకు దిగ్గజాలు లాంటి ఇద్దరు మాస్ హీరోలు బాక్సాఫీసు వద్దకు వచ్చారు. ఈ రెండు సినిమాలని నిర్మించింది ఒకటే నిర్మాణ సంస్థ కావడం మరో విశేషం. ముందుగా నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి బరిలో దిగింది. అఖండ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్ ఆ అంచనాలని మరింతగా పెంచాయి. క్రాక్ తో హిట్టు కొట్టిన దర్శకుడు గోపిచంద్ ఫుల్ ఫామ్ లో వుండటం.. బాలకృష్ణ కి కలిసొచ్చిన ఫ్యాక్షన్ కథ కావడం.. ఇవన్నీ వీరసింహపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. మరి ఈ అంచనాలని వీరసింహా అందుకుందా ? బాలయ్య ఖాతాలో మరో విజయం పడింది ? 


కథ:


జై సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ) తల్లి మీనాక్షి (హనీ రోజ్) ఇద్దరూ ఓ హోటల్ పెట్టుకొని ఇస్తాంబుల్‌లో జీవితం గడుపుతుంటారు. జైసింహాకి  అక్కడే పరిచయమైన ఈషా (శ్రుతి హాసన్)తో పెళ్లి  రెడీ అవుతారు.  ఈ విష‌యాన్ని ఈషా త‌న తండ్రి (మురళీ శర్మ)తో చెప్పగా.. దానికి అత‌ను కూడా ఒప్పుకొంటాడు. సంబంధం గురించి మాట్లాడ‌టానికి జై తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మని చెబుతాడు. అప్పటి వరకు తండ్రి లేడని అనుకుంటున్న‌ జైసింహకు త‌న త‌ల్లి ఓ నిజం చెబుతుంది. రాయలసీమలో జైసింహ తండ్రి వీరసింహారెడ్డి(బాలకృష్ణ ) పెద్ద ప్యాక్షన్ లీడర్.  వీరసింహని చంపడానికి  ప్రతాపరెడ్డి (దునియా విజయ్) ఎదురుచూస్తుంటాడు.


అనేకసార్లు దాడి వీరసింహ చేతిలో చావుదెబ్బలు తింటాడు.  ఇదే సమయంలో  వీరసింహారెడ్డి.. కొడుకు పెళ్లి కోసమని ఇస్తాంబుల్ వస్తాడు.  వీరా సీమ వ‌దిలి ఇస్తాంబుల్ వెళ్లాడ‌ని తెలుసుకున్న  ప్రతాప్  చంపేందుకు త‌న భార్య‌ భాను (వరలక్ష్మీ శరత్ కుమార్)తో క‌లిసి అక్క‌డికి వెళ్తాడు.  ఇంత‌కీ ఆ భాను మ‌రెవ‌రో కాదు.. వీర‌సింహారెడ్డికి స్వయానా చెల్లెలు. ఎన్నో ఏళ్లుగా త‌న అన్న చావు చూడాల‌ని ప‌గ‌తో ర‌గిలిపోతుంటుంది. అందుకే  అత‌ని శత్రువు ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకుంటుంది. మ‌రి వీర‌సింహారెడ్డిని చంపేందుకు ఇస్తాంబుల్ వెళ్లిన ప్రతాప్ రెడ్డి, భాను పగ సాధించారా?  అస‌లు త‌న అన్నను చంపాల‌ని భాను ఎందుకు పగ పట్టింది? ప్రతాప్ రెడ్డికి అత‌నికి ఉన్న పగ ఏంటి? అన్నది మిగ‌తా క‌థ‌.


విశ్లేషణ:


ఇది వరకు బాలకృష్ణ కొన్ని ఫ్యాక్షన్ సినిమాలు చేశారు. అయితే వీరసింహాలో వున్న కొత్తపాయింట్ ఏమిటంటే.. సిస్టర్ సెంటిమెంట్. ఒక ఎమోషనల్ ఫ్యాక్షన్ కథ చెప్పానుకున్నా దర్శకుడి ప్రయత్నం కొంతవరకూ సక్సెస్ అయ్యింది. ప్రతాప్ రెడ్డి పగతో కథ మొదలౌతుంది. తర్వాత జై సింహ ఇస్తాంబుల్ ట్రాక్ వస్తుంది. ఎంట్రీ ఫైట్ బాగా డిజైన్ చేశారు. శ్రుతి హాసన్ ట్రాక్ అంతగా వర్క్ అవుట్ కాలేదు. అయితే కథ సీమకి వచ్చిన తర్వాత వీరసింహ రెడ్డి నేపధ్యం ఇంటర్వెల్ వరకూ పరుగులు పెట్టిస్తుంది.  వీర‌సింహారెడ్డిలో ప్రథమార్ధంలో క‌థ పెద్దగా క‌నిపించ‌కపోయిన మాస్ ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ కి నచ్చే మసాలా దట్టించడంలో దర్శకుడు పై చేయి సాధించాడు.


ప్రతాప్ రెడ్డి, వీరసింహా  మ‌ధ్య‌లో వ‌చ్చే ప్రతి పోరాట‌ ఘ‌ట్టాన్నీ మాస్ కి నచ్చేలా తీర్చిదిద్దారు.  పెళ్లి వేడుక‌లో వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్‌, కుర్చీలో కూర్చొనే  ప్ర‌తాప్ రెడ్డి గ్యాంగ్‌ని వీర‌సింహారెడ్డి ఊచకత కోసే సీన్  ప్ర‌త్యేక ఆక‌ర్షణ‌గా నిలుస్తాయి.సెకండాఫ్‌లో వీరసింహారెడ్డికి అసలుఇ సమస్య వచ్చి పడింది. అతని చెల్లికి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని.. అది ప‌గ‌గా మార‌డానికి వెన‌కున్న కార‌ణాన్ని చూపించారు. ఐతే ఇది అంత బలంగా వుండదు  జైబాల‌య్య పాట‌ను దానికి ముందు వ‌చ్చే యాక్షన్ ఎపిసోడ్‌ను తీర్చిదిద్దిన తీరు బాగున్నప్పటికీ తర్వాత అంత కాస్త సాగదీత అనిపిస్తుంది. ఎమోషనల్ ట్రాక్ వర్క్ అవుట్ కాలేదు. ముగింపు కూడా రొటీన్ గానే వుంటుంది. 


నటీనటులు :


బాలకృష్ణ వన్ మ్యాన్ షో ఇది. మరోసారి సినిమా కథలో మాసీగా ఆకట్టుకున్నారు బాలయ్య. యాక్షన్, డైలాగులు, ఎలివేషన్స్ ఫ్యాన్స్ ని నచ్చుతాయి. డ్యాన్సులు కూడా హుషారుగా చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలో ఎమోషన్ , పగ రెండూ వున్నాయి. తను చక్కగా చేసింది. దునియా విజయ్ మొరటు విలన్ గా కనిపించాడు. హనీ రోజ్ కి మంచి పాత్ర దక్కింది. శ్రుతి హాసన్ పాటలు పరిమితమైయంది, మిగతా నటీనటులు పరిధిమేర చేశారు.


టెక్నికల్ :


తమన్ మరోసారి అదరగొట్టాడు. నేపధ్య సంగీతం పాటలు రెండూ బావున్నాయి. కెమరాపనితనం రిచ్ గా వుంది, నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు ప్రధాన ఆకర్షణ. పొలిటికల్ డైలాగులు బాగా పేలాయి. దర్శకుడు గోపి మలినేని బాలయ్య ఫ్యాన్స్ ని ద్రుష్టి పెట్టుకుని తీసిన సినిమా ఇది. సెకండ్ హాఫ్ పై ఇంకాస్త ఫోకస్ చేసి వుంటే రిజల్ట్ బావుండేది.


ప్లస్ పాయింట్స్

 
బాలకృష్ణ
యాక్షన్, డైలాగులు
నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


కొత్తదనం లేని కథ
ఎమోషన్ వర్క్ అవుట్ కాకపోవడం
సెకండ్ హాఫ్


ఫైనల్ వర్డిక్ట్ : అభిమానులకు మాత్రమే సింహ గర్జన