ENGLISH

వీరసింహా అప్పుడే లాభాల బాట పట్టిందా ?

13 January 2023-14:36 PM

సంక్రాంతి రెండు పెద్ద సినిమా వీరసింహరెడ్డి,, వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండిటికి నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే నిర్మాతలు లెక్కలు మాత్రం గట్టిగానే చెబుతున్నారు. వీరసింహారెడ్డి' లెక్క బయటికి వచ్చింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్లు వసూలు చేసింది. బాలకృష్ణ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటున్నారు.

 

వీర సింహారెడ్డికి చాలా సెంటర్లలో ప్రీమియర్లు జరిగాయి. అని చోట్ల రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిందని, అమెరికాలో ఒక మిలియన్ మార్క్ దిశగా దూసుకెళ్తూ.. అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిందని ప్రకటిస్తున్నారు నిర్మాతలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 60 కోట్లు ఇచ్చారు. రెండు రోజు గడవకముందే రూ.54 అంటే రెండు రోజుల్లోనే లాభాలు బాట వైపు వేల్లిపోయినట్లే. అయితే నిర్మాతల చెబుతున్న లెక్కల్లో వాస్తవం ఏమిటో ఎవరికీ తెలీదు. ఇలాంటి లెక్కలన్నీ ప్రకటనలకు మాత్రమే పరిమితమౌతుంటాయి.