ENGLISH

హిట్‌.. ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చిన వెంకీ

14 December 2022-10:00 AM

అగ్ర హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటే.... వెంకీ మాత్రం ఆచి తూచి అడుగులేస్తున్నాడు. త‌న నుంచి ఎలాంటి అప్‌డేట్లూ లేకుండా పోతున్నాయి. ఈమ‌ధ్య `ఓరి దేవుడా`లో అతిథి పాత్ర‌లో మెరిశాడు వెంకీ. త‌న కొత్త సినిమా క‌బుర్లేం వినిపించ‌డం లేదు. ఎట్ట‌కేల‌కు వెంకీ నుంచి త్వ‌ర‌లోనే ఓ అప్‌డేట్ రాబోతోంది. త‌ను ఓ కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌కు ఓకే చెప్పాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

 

ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు. శైలేష్ కొల‌ను. హిట్‌, హిట్ 2 చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు శైలేష్‌. ఇప్పుడు హిట్ 3 ప‌ట్టాలెక్కించే ప‌నుల్లో ఉన్నాడు. ఇటీవ‌ల వెంకీని క‌లిసి ఓ క‌థ చెప్పిన‌ట్టు స‌మాచారం. దాన్ని వెంకీ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసేసిన‌ట్టు తెలుస్తోంది. వెంక‌టేష్ న‌టించే 75వ సినిమా ఇదే. హిట్ 3 కంటే ముందు... ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ని, ఇది కూడా ఓ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అని స‌మాచారం అందుతోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

ALSO READ: Avatar 2: అవసరాల శ్రీనివాస్ మాటలతో అవతార్-‌2