ENGLISH

ఒకే నెల‌లో ఫినిష్ చేస్తార్ట‌

12 March 2021-16:30 PM

అగ్ర క‌థానాయ‌కుడి సినిమా అంటే.. యేడాది పాటు సెట్లో ఉండాల్సిందే. ఆ సినిమాల‌కు ఉండే హ‌డావుడి అలాంటిది. అయితే.. కొన్ని సినిమాలు చ‌క చ‌క పూర్తి చేసేస్తుంటారు. దృశ్య‌మ్ 2.. కేవ‌లం ఒక నెల‌లోనే ఫినిష్ చేస్తార‌ట‌. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన దృశ్య‌మ్ సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళంలో విడుద‌లైన‌.. దృశ్య‌మ్ కి రీమేక్ ఇది. అక్క‌డ దృశ్య‌మ్ 2 వ‌చ్చి మంచి విజ‌యాన్ని అందుకుంది. అందుకే.. దృశ్య‌మ్ 2 ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

 

ఇటీవ‌లే.. ఈ సినిమా క్లాప్ కొట్టుకుంది. ఏప్రిల్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లెడ‌తారు. ఏప్రిల్ లోనే సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేస్తార‌ని స‌మాచారం. జూన్ - జులైల‌లో ఈ సినిమాని విడుద‌ల చేస్తారు. ఈ వేస‌విలో.. నార‌ప్ప విడుద‌ల అవుతుంది. ఎఫ్ 3 కూడా ఈ యేడాదే వ‌స్తుంది. అంటే.. 2021లో వెంకీ నుంచి 3 సినిమాలు చూడొచ్చ‌న్న‌మాట‌.

ALSO READ: మ‌రో శిష్యుడికి ఛాన్స్ ఇస్తున్న సుకుమార్‌