ENGLISH

రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది గురూ!

08 March 2017-16:31 PM

బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం సాలాఖ‌డూస్‌. తెలుగులో వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా `గురు` పేరుతో రీమేక్ చేస్తున్నారు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌కురాలు. వేస‌విలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర‌బృందం ఫిక్స‌య్యింది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. నిజానికి జ‌న‌వ‌రి 26నే ఈ సినిమా విడుద‌ల కావాల్సింది. ఆ త‌ర‌వాత‌... ఫిబ్ర‌వ‌రి 10న తీసుకొద్దామ‌నుకొన్నారు. అయితే.. స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కావ‌డ‌మే గురుకి ప్లస్ అవుతుంద‌న్న ఉద్దేశంలో విడుద‌ల వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 7న ముహూర్తం ఖ‌రారు చేశారు. ఈ నెల ద్వితీయార్థంలో ప్రమోష‌న్ల‌కు స్పీడ‌ప్ చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. వెంకీ పాడిన పాట ఇప్ప‌టికే యూ ట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.