ENGLISH

వెంకీ... 30 ఏళ్ల‌లో ఇదే తొలిసారి

06 March 2017-13:09 PM

అగ్ర క‌థానాయ‌కులు చిరంజీవి, నాగార్జున ఎప్పుడో పాట‌లు పాడేశారు. ఆ త‌ర‌వాతి త‌రంలో మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఎన్టీఆర్‌లు కూడా గాయ‌కులుగా రాణించారు. ఇప్పుడు వెంక‌టేష్ కూడా ఓ పాట పాడేశారు. 30 ఏళ్ల వెంకీ కెరీర్‌లో ఓ పాట పాడ‌డం ఇదే తొలిసారి. వెంకీ కొత్త సినిమా గురు కోసం ఈ ఫీట్ చేశారాయ‌న‌. బాలీవుడ్ చిత్రం సాలా ఖ‌దూస్‌కి రీమేక్ ఇది. సుధా కొంగ‌ర ద‌ర్శ‌కురాలు. సంతోష్ నారాయ‌ణ్ అందించిన బాణీకి, భాస్క‌ర భ‌ట్ల సాహిత్యం అందించారు. జింగిడి జింగిడి అంటూ వెంకీ పాడిన పాట‌ని యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది చిత్ర‌బృందం. వెంకీ హుషారుగా.. త‌న‌దైన శైలిలో ఈ పాట పాడ‌డం అభిమానుల‌తో పాటు సినీ ప్రియుల్ని ఆక‌ట్టుకొంటోంది. గురు సినిమాకి వెంకీ పాడిన ఈ పాట ఓ మేజ‌ర్ హైలెట్‌గా మారే అవ‌కాశాలున్నాయి.

ALSO READ: జింగిడి సాంగ్ మేకింగ్ కోసం క్లిక్ చేయండి