ENGLISH

విలన్ గా వెంకటేష్?

27 August 2017-12:39 PM

ఛాలెంజింగ్ పాత్రలని చేయడానికి ముందు వరుసలో ఉండే అతికొద్దిమంది హీరోలలో మొదటగా వినిపించే పేరు మన విక్టరీ వెంకటేష్.

ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న పాత్రలు చూస్తుంటే, ఆయన తన కెరీర్ ను ఎలా మలుచుకుంట్టునారో తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఆయన ఒక పౌరాణికి పాత్ర చేయడానికి సిద్ధం అయినట్టు సమాచారం.

ఆ పౌరాణిక పాత్ర కూడా హిరణ్యకశిపుడుది కావడం విశేషం! హిరణ్యకశిపుడు కోణంలో ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తీసేందుకు టాలెంటెడ్ డైరెక్టర్ అయిన గుణశేఖర్ ప్రయత్నాలు మొదలుపెట్టాడట.

ఇక ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరీ ఈ విలన్ ఛాయలున్న పాత్రలో వెంకి ఎలా ఒదిగిపోనున్నడో అన్నది తెరపైన చూడాలి.

 

ALSO READ: మహేష్ కత్తి VS పవన్ ఫ్యాన్స్!