ENGLISH

రష్మిక-విజయ్ పెళ్లి.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

29 December 2023-10:40 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ మాత్రం ఎప్పుడూ ఓపెన్ అవలేదు. ఫాన్స్ మాత్రం వీరి పెళ్లి కోసం ఈగర్లీ వెయిటింగ్. రష్మిక ఏ ఫంక్షన్ లో కనిపించినా, విజయ్ ఫాన్స్ వదినా అని ప్రేమగా పిలుస్తారు. ఇంత మంది సంతోషానికి గండి కొట్టాడు వేణు స్వామి. సెలబ్రిటీస్ జాతకాలు చెప్తూ ఫేమస్ అయిన ఈయన ఎప్పుడూ ఏ జంట విడిపోతారో కూడా చెప్తుంటాడు.


రీసెంట్ గా పెళ్లి చేసుకున్న మెగా కపుల్స్ వరుణ్, లావణ్య లు కలిసుండరు విడిపోతారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మెగా ఫాన్స్ కి ఆగ్రహం తెప్పించాడు. ఇప్పుడు రష్మిక, విజయ్ దేవరకొండ కూడా పెళ్లి చేసుకున్న విడిపోతారంటూ చేసిన కామెంట్స్ కి విజయ్, రష్మిక ఫాన్స్ వేణు స్వామిపై కారాలు, మిరియాలు నూరుతున్నారు.
       
      
ఈ మధ్య కాలంలోనే విజయ్ దేవర కొండ త్వరలోనే గుడ్  న్యూస్ చెబుతా, నా లైఫ్ లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది అంటూ పోస్ట్ పెట్టి ఊరించాడు. ఇక అందరు పెళ్లి న్యూస్ అనుకుని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి రంగం లోకి వచ్చి విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకొని విడిపోతారని, విజయ్ ని పెళ్లి చేసుకోవద్దని రష్మికకు కూడా చెప్పానని, గొడవపడి అప్పటినుంచి రష్మిక నాతో మాట్లాడటం మానేసిందని వేణుస్వామి అన్నారు.ఈ కామెంట్స్ పై రష్మిక, విజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.