ENGLISH

అర్థ‌రాత్రి హీరోయిన్ ఇంట్లో దూరిన హీరో

10 August 2020-14:00 PM

బాలీవుడ్ అంటేనే మ‌సాలా వార్త‌ల‌కు పుట్టినిల్లు. హీరో - హీరోయిన్ల మ‌ధ్య ఎఫైర్ల గురించి.. అక్క‌డ క‌థ‌లు క‌థ‌లుగా చెప్తుంటారు. దానికి త‌గ్గ‌ట్టే.. కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతుంటాయి.  కత్రినా కైఫ్ - విక్కీ కౌశ‌ల్‌ మధ్య ఏదో ఉందనే వార్తలు బాలీవుడ్ లో చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని చెప్పుకున్నారు. అయితే అటు క‌త్రినా, ఇటు విక్కీ ఈ విష‌యాల‌పై పెద్ద‌గా స్పందించేవారు కాదు. `మా మ‌ధ్య ఏం లేదు` అంటూ బుకాయిస్తుండేవారు.కానీ.. వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని చెప్ప‌డానికి ఓ ఆధారం దొరికేసింది.

తాజాగా ఆదివారం అర్థరాత్రి వేళ ముసుగు వేసుకొని కత్రినా ఇంటికి వెళ్లిన విక్కీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తలకు క్యాప్‌, ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజు ధరించిన విక్కీ.. ఆదివారం రాత్రి ముంబైలోని కత్రినా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కంటా పడకుండా హడావిడిగా కారు దిగి లోపలికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాంతో విక్కీ - కౌశల్ మ‌ధ్య న‌డుస్తున్న ర‌హ‌స్య ఎఫైర్ కాస్త మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది. అర్థ‌రాత్రి హీరోయిన్ ఇంట్లో హీరోకి ఏం పని?  అంటూ నెటిజ‌న్లు ఆరా తీస్తున్నారు. మ‌రి దీనికి ఏం స‌మాధానం చెబుతారో?

ALSO READ: ప‌వ‌న్ నిద్ర‌పోయాడు... మ‌హేష్ వెళ్లిపోయాడు