ENGLISH

విద్యాబాలన్‌ మరీ ఇంత హాట్‌గానా?

07 March 2017-13:26 PM

గ్లామర్‌తో సంబంధం లేకుండా విభిన్నతరహా చిత్రాల్లో నటించేందుకు విద్యాబాలన్‌ ఎప్పుడూ ముందుంటుంది. అలాగే ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన 'డర్టీ పిక్చర్‌' సినిమా సంచలనాత్మక విజయం సాధించింది. గ్లామర్‌ ఎక్కువైనా, తక్కువైనా కానీ, ఆమెకు కథతోనే మెయిన్‌ లింక్‌. కథకి ఎంత గ్లామర్‌ అవసరమైనా నటించడానికి ఆమె వెనుకాడదు. అలాగే 'డర్టీ పిక్చర్‌' సినిమాకి ఎన్ని విమర్శలు వచ్చినా ఒక నటిగా ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. విద్యాబాలన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'బేగమ్‌ జాన్‌'. ఈ సినిమాలో ఆమె ఓ వేస్యవాటిక నిర్వాహకురాలిగా నటిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఆ లుక్‌లో విద్యా బాలన్‌ హాట్‌ అప్పియరెన్స్‌కి చాలా సెన్సేషనల్‌ కామెంట్స్‌ వచ్చాయి. తాజాగా 'మై బాడీ మై హౌస్‌, మై కంట్రీ మై రూల్స్‌' అనే కాప్షన్‌తో మరో పోస్టర్‌ విడుదలయ్యింది. ఈ పోస్టర్‌ మరీ హాట్‌గా ఉంది. మత్తెక్కించే చూపులతో, చేతిలో హుక్కా పట్టుకుని ఓ వేస్య బాడీలాంగ్వేజ్‌ ఇలాగే ఉంటుందా.. అన్నట్లుగా ఉంది ఆ పోస్టర్‌లో విద్యాబాలన్‌ పోజు. అయితే ఈ తాజా స్టిల్‌ చూస్తుంటే ఈ సినిమా కూడా 'డర్టీ పిక్చర్‌' తరహాలో తెరకెక్కుతోన్న చిత్రం కావచ్చు అనిపిస్తోంది. అంటే అంత హాట్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అయినా పోస్టర్‌ చూసి సినిమా మొత్తం కథని అంచనా వేయలేం కదా. ఏమో చూడాలి. ఏది ఏమైనా విద్యా బాలన్‌ ఒప్పుకుందంటే సినిమాలో ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది. 

ALSO READ: చిరు ఎందుకు క‌లిసిన‌ట్టు...??