ENGLISH

విజయ్ ఆంటోనీ మూవీ 'తుఫాన్' ఆగష్టు 9న గ్రాండ్ రిలీజ్

02 August 2024-16:09 PM

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. 'తుఫాన్' సినిమాను పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్‌లో రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్.


'తుఫాన్' సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన స్నీక్ పీక్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్‌కు కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వబోతోంది 'తుఫాన్' మూవీ.