ENGLISH

స్వీటీతో రౌడీ... కాంబో కుదిరిన‌ట్టేనా?

03 July 2021-16:00 PM

నిశ్శ‌బ్దం త‌ర‌వాత‌.. అనుష్క తెలుగులో మ‌రో సినిమా ఒప్పుకోలేదు. అస‌లు అనుష్క‌కు సినిమాలు చేసే మూడ్ లేద‌ని, ప్ర‌స్తుతం వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆస్వాదిస్తోంద‌ని, ఆమె సినిమాల‌కు క్ర‌మంగా దూరం కానుంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే.. యూవీ క్రియేష‌న్స్ లో ఓ సినిమా ఒప్పుకుని వార్త‌ల‌కు చెక్ పెట్టింది. 'రా రా కృష్ణయ్య' ఫేం మహేశ్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. 25 ఏళ్ల యువకుడికి - 40 ఏళ్ల మహిళకీ మధ్య సాగే క‌థ ఇది. 'మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది.

 

అయితే ఈ సినిమాకి సంబంధించిన మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అదే నిజ‌మైతే.. ఈ ప్రాజెక్టుకు మ‌రింత క్రేజ్ వ‌చ్చిన‌ట్టే. అయితే ఈ వార్త‌ల్లో నిజం ఉందో, లేదో తెలీదు. కాక‌పోతే అనుష్క - విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి ఉన్న ఓ స్టిల్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దాన్ని బ‌ట్టి.. ఈ ఊహాగానాలు అల్లేస్తున్నారు జ‌నాలు. ఈ వార్త నిజ‌మైతే.. మ‌రో ఇంట్ర‌స్టింగ్ సినిమాని తెర‌పై చూసే అవ‌కాశం ద‌క్కుతుంది.

ALSO READ: క‌ల్యాణ్‌రామ్‌.... గూఢ‌చారి 1960