ENGLISH

కాశ్మీరు లోయ‌లో.. విజ‌య్‌... స‌మంత‌!

22 March 2022-12:30 PM

టాలీవుడ్ లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్ కి తెర లేచింది. త్వ‌ర‌లోనే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత క‌లిసి న‌టించ‌బోతున్నారు. విజయ్ దేవ‌ర‌కొండ కోసం శివ నిర్వాణ ఓ క‌థ త‌యారు చేస్తున్నారు. ఇందులో స‌మంత‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. నిన్ను కోరి, మ‌జిలి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు శివ నిర్వాణ‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ట‌క్ జ‌గ‌దీష్ నిరాశ ప‌రిచింది. అయిన‌ప్ప‌టికీ.. విజ‌య్ శివ నిర్వాణ‌కు అవ‌కాశం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల స‌మంత‌ని క‌లిసి శివ క‌థ‌ని వినిపించాడ‌ని టాక్‌. శివ నిర్వాణ అంటే స‌మంత‌కూ అభిమాన‌మే. మ‌జిలీలో స‌మంత పాత్ర‌ని చాలా బాగా తీర్చిదిద్దాడు శివ నిర్వాణ‌. అందుకే శివ అడిగిన వెంట‌నే స‌మంత కూడా ఒప్పుకుంది. స‌మంత - విజ‌య్‌లు ఇది వ‌ర‌కు మ‌హాన‌టిలో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

 

శివ రాసుకున్న క‌థ క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం. సినిమా అంతా అక్క‌డే షూట్ చేస్తార్ట‌. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌`తో బిజీగా ఉన్నాడు. అది అవ్వ‌గానే.. శివ నిర్వాణ సినిమానే సెట్స్‌పైకి వెళ్తుంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

ALSO READ: ఆర్‌.ఆర్‌.ఆర్ లేటెస్ట్‌: ఎన్టీఆర్ ఎంట్రీ ఆల‌స్యం