ENGLISH

రెమ్యునరేషన్ పెంచిన రౌడీ స్టార్

01 April 2024-12:48 PM

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా ఆడియన్స్ ని అలరించనున్నాడు. లైగర్ డిజాస్టర్ తరవాత ఖుషి మూవీతో కొంచెం పరవాలేదు అనిపించకున్నాడు. ఖుషి తరవాత విజయ్ నుంచి వస్తున్న మూవీ ఇది. ఈ సారి ఎలా  అయినా  బ్లాక్ బ్లస్టర్ హిట్ పడుతుంది అని ధీమాగా ఉన్నాడు విజయ్. ఏప్రిల్ 5 న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ట్రయిలర్, పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. విజయ్ - రష్మిక జోడి ఇప్పటివరకు పర్ఫెక్ట్ జోడి అనుకున్నారు ఫాన్స్. కానీ విజయ్ - మృణాల్ జంట ఇంకా చూడ ముచ్చటగా ఉంది. స్క్రీన్ పై వీరి జోడి చేసే మ్యాజిక్ చూసేందుకు ఫాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.  
 

దిల్ రాజు నిర్మాణంలో 50 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవటంతో బడ్జెట్ పెరిగినట్లు టాక్. అంతే కాక విజయ్ రెమ్యునరేషన్ కూడా పెంచి తీసుకోవటం వలన అదనంగా అయినట్టు తెలుస్తోంది. విజయ్ తన గత సినిమాలకి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా, ఫ్యామిలీ స్టార్ కోసం 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఒకే సారి మూడు కోట్లు పెంచాడు. విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ కి ఆమాత్రం ఇస్తే తప్పేంటి అంటున్నారు అతని ఫాన్స్. విజయ్ దేవర కొండకి మంచి మార్కెట్ ఉంది. కచ్చితంగా  నిర్మాతకి అంతకు మించి వసూళ్లు తెచ్చి పెడుతుంది ఫ్యామిలి స్టార్ అని ట్రేడ్ పండితుల అభిప్రాయం.


ఈ మూవీ కోసం దిల్ రాజ్ 50 కోట్లు పెట్టినా ఇప్పటికే భారీ మొత్తం ముట్టినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ థియేట్రికల్ రైట్స్ 45 కోట్లకి అమ్ముడుపోయినట్టు సమాచారం. డిజిటల్ రైట్స్ కూడా భారీ ధర పలికినట్టు తెలుస్తోంది. రిలీజ్ అయిన ఒకటి రెండు రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు వస్తాయని నమ్మకంగా ఉన్నారు. టిల్లు స్క్వేర్ తప్ప మూవీస్ కూడా పెద్దగా ఎం లేకపోవటం ఫ్యామిలీ స్టార్ కి ఇంకో  ప్లస్.