ENGLISH

Ashwini Dutt: అశ్వ‌నీదత్ ప్ర‌పోజ‌ల్ కు నో చెప్పిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌

12 September 2022-11:00 AM

ఎవ‌డే సుబ్రహ్మ‌ణ్యం, మ‌హాన‌టి.. ఇవి రెండూ వైజ‌యంతీ మూవీస్ నుంచి వ‌చ్చిన సినిమాలే. వీటిలో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా కీల‌క‌మైన పాత్ర‌లు పోషించాడు. అయితే విజ‌య్ హీరోగా వైజ‌యంతీ మూవీస్ లో ఓ పెద్ద సినిమా చేయాలన్న‌ది అశ్వ‌నీద‌త్ ఆలోచ‌న‌. అందుకోసం చాలా కాలంగా క‌థ‌లు వింటున్నారాయన‌. తాజాగా.. వైజ‌యంతీ మూవీస్ లో సీతారామం లాంటి హిట్ ప‌డింది. ఈ సినిమాకి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడు. అందుకే హ‌ను - విజ‌య్ దేవ‌రకొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా సెట్ చేయాల‌ని అశ్వ‌నీద‌త్ భావించారు. ఈ ప్ర‌పోజ‌ల్ విజ‌య్ దేవ‌ర‌కొండ ముందుకు తీసుకెళ్లారు. అయితే విజ‌య్ మాత్రం.. హ‌ను రాఘ‌వ‌పూడి తో సినిమా అంటే నో చెప్పిన‌ట్టు టాక్.

 

దానికి కార‌ణం... ఇది వ‌ర‌కు కూడా హ‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు రెండు క‌థ‌లు వినిపించాడు. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు, సీతారామం క‌థ‌లు ముందుగా విజ‌య్ ద‌గ్గ‌ర‌కే వెళ్లాయి. ఆ క‌థ‌లు విజ‌య్‌కి పెద్దగా న‌చ్చ‌లేదు. అందుకే మ‌రోసారి హ‌ను రాఘ‌వ‌పూడి క‌థ చెబితే దాన్ని రిజెక్ట్ చేస్తే... ఇద్ద‌రి మ‌ధ్యా సంబంధాలు బెడ‌సికొడ‌తాయ‌ని విజ‌య్ భావించాడ‌ట‌. అందుకే హ‌ను అయితే వ‌ద్దు అని సున్నితంగా చెప్పిన‌ట్టు టాక్. ఆ త‌ర‌వాత‌.. రాజ్‌, డీకే ని రంగంలోకి దించారు అశ్వ‌నీద‌త్. ఫ్యామిలీమెన్ సిరీస్‌తో రాజ్‌, డీకే పెద్ద ద‌ర్శ‌కులు అయిపోయారు. ఇప్పుడు ఈ కాంబోలో ఆల్మోస్ట్ సినిమా ఫిక్స్ అని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

ALSO READ: Krishnam Raju: రెబల్ స్టార్ ఆరోగ్యాన్ని దెబ్బతీసిన హోటల్ ట్రిప్