ENGLISH

'పుష్ష‌'తో చేతులు క‌లుపుతున్న రౌడీ?

08 November 2020-10:00 AM

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష‌`. ర‌ష్మిక క‌థానాయిక‌. ఈ సినిమా షూటింగ్ అతి త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అయితే... ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌రమైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే... `పుష్ష‌`లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ అతిథి పాత్ర‌లో కనిపిచ‌బోతున్నాడ‌ట‌. ఆ పాత్ర ఉండేది కాసేపే అయినా - ప్రేక్ష‌కుల్ని థ్రిల్ కి గురి చేస్తుంద‌ని స‌మాచారం.

 

విజ‌య్ ఇప్పుడో స్టార్‌. తన స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ని మైమ‌ర‌పిస్తుంది. కాసేపు క‌నిపించినా థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతుంటాయి. అందుకే చిన్న పాత్ర కోసం విజ‌య్ ని సంప్ర‌దించింద‌ట చిత్ర‌బృందం. చిత్ర నిర్మాత‌లు మైత్రీ మూవీస్ తో విజ‌య్‌కి మంచి అనుబంధం ఉంది. దానికి తోడు సుకుమార్ తో త్వ‌ర‌లోనే విజ‌య్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. పైగా ఇది బన్నీ సినిమా. ఇవ‌న్నీ విజ‌య్ ని సైతం టెమ్ట్ చేసుంటాయి. అన్న‌ట్టు ఈ సినిమాలో మ‌రో పాత్ర‌లో కూడా ఓ యంగ్ హీరో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

 

ఈ పాత్ర కోసం నారా రోహిత్ ని సంప్ర‌దించింది చిత్ర‌బృందం. తాను చేస్తాడో, లేదో అన్న విష‌యంలో క్లారిటీ లేదు. సో.. రోహిత్ స్థానంలో మ‌రో యువ హీరో కోసం అన్వేషిస్తున్నారు.

ALSO READ: రాజ‌మౌళికి రామ్ చ‌ర‌ణ్ `ప‌చ్చ‌ని` ఛాలెంజ్‌!