ENGLISH

చరణ్ కి నో చెప్పిన విజయ్

28 August 2024-14:29 PM

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికీ చెర్రీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టు, అందుకే  బుచ్చి బాబుతో RC16 కి రెడీ అయినట్లు సమాచారం. ఇంతలోనే మళ్ళీ శంకర్ గేమ్ చేంజర్ లో కొంత ప్యాచ్ వర్క్ ఉందని, చెర్రీ  డేట్స్ అడిగినట్టు సమాచారం. ఇదిలా ఉండగా RC16 పై మెగా ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. బుచ్చి బాబు మొదటి సినిమాకే నేషనల్ అవార్డు సాధించటంతో చెర్రీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని నమ్మకంగా ఉన్నారు. ఈ మూవీ అప్డేట్స్ పై ఆసక్తి కనపరుస్తున్నారు. 


లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ RC16 పై చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెనలో విజయ్‌ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. తన పాత్రకి వంద శాతం న్యాయం చేసాడు. అదే కాన్ఫిడెన్స్ తో మళ్ళీ బుచ్చి బాబు సేతుపతిని సంప్రదించారని సమాచారం. కానీ ఈ ఆఫర్ ని విజయ్ సేతుపతి సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. డబుల్ రెమ్యునరేషన్ ఇస్తా అన్నా 'నో' చెప్పారని టాక్. 


అదేంటి గ్లోబల్ స్టార్ సినిమా ఛాన్స్ ని సేతుపతి మిస్ చేసుకున్నాడని అంతా అనుకుంటున్నారు. ఈ విషయం పై సేతుపతి క్లారిటీ ఇచ్చారు. 'నాకు బుచ్చిబాబు కథ అంతా చెప్పారు. చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీప్రియులు అంతా సర్‌ప్రైజ్‌ అయ్యేలా సినిమా ఉంటుందని, ఈ సినిమాలో నటించాలని బుచ్చి బాబు తనని రిక్వెస్ట్ చేసారని, చరణ్‌ కు తండ్రి పాత్ర లో అయితే నటించలేను అంటూ చెప్పినట్లు' తెలిపారు. తండ్రి పాత్రలు చేసి, మళ్ళీ హీరోగా కొనసాగలేకపోతున్నా అని, కెరీర్‌ లో కొంత వెనకపడిపోతున్న అని సేతుపతి అభిప్రాయం. అందుకే చరణ్ కి తండ్రిగా నో చెప్పారట.