ENGLISH

విజ‌య్‌సేతుప‌తే.. రాక్ష‌సుడు

03 August 2021-12:16 PM

తెలుగులో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `రాక్ష‌సుడు`. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ కి బూస్ట‌ప్ ఇచ్చిన హిట్ ఇది. ద‌ర్శ‌కుడిగా ర‌మేష్ వ‌ర్మ‌ని ట్రాక్ లో నిల‌బెట్టింది. ఇప్పుడు `రాక్ష‌సుడు 2` వ‌స్తోంది. ఈ సినిమాకి ఏకంగా రూ.100 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు చిత్ర‌బృందం చెప్పింది. అయితే హీరో ఎవ‌రో క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే... ఓ హీరోకి మాత్రం క‌థ చెప్పి లాక్ చేసిన‌ట్టు స‌మాచారం. ఆ హీరోనే విజ‌య్ సేతుప‌తి.

 

త‌మిళంలో స్టార్ గా ఎదిగాడు విజ‌య్ సేతుప‌తి. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. విజ‌య్ ని తీసుకుంటే, తెలుగు - త‌మిళంలో మంచి బిజినెస్ జ‌ర‌గ‌డం ఖాయం. అందుకే విజ‌య్ సేతుప‌తిని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. త్వ‌ర‌లోనే.. విజ‌య్ సేతుప‌తి పేరుని అధికారికంగా ప్ర‌క‌టిస్తార్ట‌. కాక‌పోతే.. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. హిందీలో విజ‌య్ కి అంత మార్కెట్ ఉందా? అనేదే పెద్ద డౌటు.

ALSO READ: సోనూకి రాజ‌కీయ గాలం... అయినా లొంగేదే లే!