ENGLISH

రూ.100 కోట్ల క్లబ్ లో సేతుపతి

02 July 2024-16:11 PM

విజయ్ సేతుపతి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తక్కువ టైంలోనే  పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. తన నటనా ప్రతిభతో ఎల్లలు లేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. విజయ సేతు పతిని ఎవరూ పరాయి వాడు అనుకోరు. అంతా మనవాడే అనుకుంటారు. సేతుపతి మొదటి నుంచి మూస దోరణిలో వెళ్లకుండా, ప్రయోగాలు చేస్తూ విభిన్న కథల్లో నటించాడు. తన ప్రయోగాలతో కమల్, విక్రమ్ ల చెంత చేరాడు. అందుకే చాలంజింగ్ రోల్స్ కి సేతుపతి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. రీసెంట్ గా 50 చిత్రం 'మహారాజ' తో థియేటర్స్ లో సందడి చేశాడు.


ఈ మధ్య కాలంలో విజ‌య్ సేతుప‌తి తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నాడు. సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టించిన మ‌హారాజా మూవీ వచ్చి 17రోజులు అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ 100 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సెన్సేష‌న్. ఇది ఎవరు ఊహించని విజయం. సేతుపతి మైలురాయి లాంటి  50వ సినిమాని కొత్త దర్శకుడితో చేస్తున్నాడని, అంతా విమర్శించారు. కానీ తన జడ్జ్ మెంట్ పై ముందు నుంచి ధీమాగా ఉన్నాడు సేతుపతి. ఇప్పుడు ఇంకోసారి ఈ నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేము.  మహా రాజ  మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ ని చేరుకుంది.


నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా భారతీయులనే కాదు విదేశీ ప్రేక్షకులని కూడా కట్టి పడేసింది. రిలీజైన మొదటి వారంలోనే 38.9 కోట్లు వసూళ్లతో  ఆధిపత్యాన్ని కొన‌సాగించింది.ఈ మధ్య కోలీవుడ్ ఇండస్ట్రీ సరైన హిట్ లేక సతమతమవుతోంది. ఇప్పుడు సేతుపతి మహారాజ ఇచ్చిన పాజిటీవ్ బజ్ తో మరిన్ని సినిమాలకోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ మహారాజ వసూళ్లు బాగానే ఉన్నాయని టాక్. ఓవర్సీస్ లో 17 రోజుల్లో 24 కోట్లు వసూలు చేసింది. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మహారాజా మూవీ పెట్టుబడి కంటే మూడొంతులు రాబట్టింది.