ENGLISH

లియో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

19 October 2023-16:21 PM

చిత్రం: లియో

నటీనటులు: విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్

దర్శకత్వం: లోకేష్ కనగరాజ్


నిర్మాతలు: ఎస్ ఎస్ లలిత్ కుమార్
 
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
కూర్పు: ఫిలోమిన్ రాజ్


బ్యానర్స్: 7 స్క్రీన్ స్టూడియో
విడుదల తేదీ: 19 అక్టోబర్ 2023

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

 

విజయ్ సినిమాలు తెలుగులో కూడా విడుదలౌతున్నాయి. అయితే ఏ సినిమాకి లేనంత బజ్ 'లియో' పై నెలకొంది. దీనికి కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్.  ఆయన క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్. ప్రతి ప్రచార చిత్రంతో అంచనాలు రేపుతూ.. విడుదలకు ముందు భారీ ఓపెనింగ్స్ సాధించిన లియో.. దసరా బరిలో తెలుగు సినిమాలకు ధీటుగా విడులైయింది. మరి ఇన్ని అంచనాలు మధ్య వచ్చిన లియోకి ఆ అంచనాలని అందుకుందా ? లోకేష్ మళ్ళీ విక్రమ్ మ్యాజిక్ ని క్రియేట్ చేశాడా ? 


కథ: పార్తీబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్ లో కాఫీ షాప్ నడుపుతుంటాడు. అతని భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు. అయితే ఒక దొంగల ముఠా కారణంగా పార్తి జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అయితే ఈ కేసులో పార్తిని వెంటనే నిర్దోషిగా విడుదల చేస్తుంది కోర్టు. ఈ కేసు కారణంగా పార్తి పేరు ఫోటో పేపర్ లో వస్తుంది. ఆ ఫోటో చూసిన హైదరాబాద్ లోని అంటోనీ దాస్.. పార్తిని వెతుక్కుంటూ  హిమాచల్ ప్రదేశ్ వస్తాడు. దీనికి కారణం చనిపోయాడానికి అనుకుంటున్న అంటోనీ కొడుకు లియో దాస్ కూడా అచ్చు పార్తి పోలికతో వుండటం .. అసలు ఈ లియో దాస్  కథ ఏమిటి ? అతని గతం ఏమిటి?  నిజంగా లియో దాస్ మరణించాడా?  అంటోనీ కారణం పార్తి ఎలాంటి సమస్యలు ఎదురుకున్నాడు అనేది తక్కిన కథ. 


విశ్లేషణ: లియోపై అంచనాలు పెరగడానికి కారణం లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్. ఖైదీ, మాస్టర్ విక్రమ్ అంతాలా ప్రేక్షకులని అలరించాయి. ఆ అంచనాలలో లియో చూస్తే మాత్రం నిరాశ తప్పుదు. లోకేష్ సినిమాకు చీకటిరాజ్యం లో వుంటాయి. ఇందులో కూడా చీకటి రాజ్యం వుంది కానీ అందులో పాత్రలలు, వాటి ప్రయాణం ఆకట్టుకునేలా వుండవు. తన స్టయిల్ కి భిన్నంగా ఫ్యామిలీ మ్యాన్ తరహాలో విజయ్ క్యారెక్టర్ పరిచయం చేస్తూ ఈ కథని మొదలుపెట్టాడు దర్శకుడు. విజయ్ కాఫీ షాప్ నడపడం, దొంగల ముఠా, జైలు, కోర్టు.. ఇలా ఒకొక్క సన్నివేశం వెళుతుంటుంది కానీ కథ ప్రేక్షకుడి పట్టదు. హీరోకి ఎదో బాషా తరహా ఫ్లాష్ బ్యాక్ ఉటుందనే హింట్ ప్రేక్షకుడిముందే అందుతుంది కానీ ఆ దిశగా సన్నివేశాలు నడపకపోవడంతో ఇందులో ఇంకేదైనా పాయింట్ ఉటుందనే అనుకునే లోపలే ఇంటర్వెల్ పడిపోతుంది. సంజయ్ దత్ లాంటి నటుడు.. రంగప్రవేశం చేసిన తర్వాత కథ మరో స్థాయి వెళుతుందని అనుకుంటే.. లియో మాత్రం అక్కడక్కడే తిరుగుతుంది. 


తొలిసగం ఎదోలా నడిపారు కానీ సెకండ్ హాఫ్ కి సినిమా గతి తప్పుతుంది. లియో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రక్తికట్టించలేదు. పైగా ఇందులో బలమైన విలన్ లేరు. దీంతో హీరోకి కూడా పెద్ద పని లేకుండా పోతుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాల్లో కథనం వేగంగా వుండాలి. కానీ ఇందులో మాత్రం సన్నివేశాలు అక్కడక్కడే తిరుగుతుంటాయి. పైగా కథనం నడిపే క్రమంలో చాలా లాజిక్కులు వదిలేశారు. విజయ్ పాత్రని డిజైన్ చేయడం శ్రుతి మించిన సినిమాటిక్ స్వేఛ్చ తీసుకున్నారు. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ బలంగా వునప్పటికీ అప్పటికే సాగదీసిన ఫీలింగ్ ప్రేక్షకుల మనసుల్లో పడిపోతుంది.   


నటీనటులు: విజయ్ కి రెండు కోణాలు వున్నాయి. ఆ రెండూ ఈజీగా చేసుకుంటూ వెళ్ళాడు. విజయ్ ఫ్యాన్స్ కోరుకునే మూమెంట్స్ కొన్ని వున్నాయి, యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. ఎమోషన్స్ ని కూడా పండించాడు. త్రిష్ అందంగా హుందా కనిపించింది. సంజయ్ దత్. అర్జున్ పాత్రలని సరిగ్గా వాడుకోలేదు. పెద్ద నటులని తీసుకున్నారు కానీ వాళ్లకు సరిపోయే పాత్రలు కావవి. పైగా ఆ పాత్రలు రాసుకోవడంలో బలం కనిపించలేదు. ఖైదీ నుంచి నెపోలియన్ పాత్ర తీసుకున్నారు. మడోన్నా సెబాస్టియన్ కీలకమైన పాత్ర చేసింది. గౌతం మీనన్ తో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. చివర్లో విక్రమ్  వాయిస్ కూడా వినిపిస్తుంది.  


టెక్నికల్: అనిరుధ్  నేపధ్య సంగీతం బావుంది. యాక్షన్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేసేలా చేశాడు. అయితే పాటలు అంతగా ఆకట్టుకోవు పైగా తెలుగు సాహిత్యం సరిగ్గా కుదరలేదు. కెమరాపని తనం బావుంది. లోకేష్ సినిమాలు డార్క్ లో వుంటాయి. లియో మాత్రం దీనికి భిన్నంగా సాగింది. మాటలు ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు బావున్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ 

విజయ్ 
యాక్షన్ సీన్స్ 
ఫస్ట్ హాఫ్ 


మైనస్ పాయింట్స్ 

సెకండ్ హాఫ్ 
కథలో బలం లేకపోవడం 
బలమైన విలన్ లేకపోవడం 


ఫైనల్ వర్దిక్ట్ : అంచనాలని తప్పిన లియో..