ENGLISH

విక్రమ్ మూవీ రివ్యూ & రేటింగ్

03 June 2022-14:30 PM

నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
దర్శకత్వం : లోకేష్ కనగ్ రాజ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్


రేటింగ్: 2.75/5


కమల్ హాసన్.. లోక నాయకుడు. సినిమా అభిమానులంతా ఆయన అభిమానులే. ఆయన నుండి సినిమా వస్తుందంటే అందరూ అలర్ట్ అవుతారు. కమల్ ట్రాక్ రికార్డ్ అలాంటింది. ఇప్పుడు 'విక్రమ్' అలానే అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాసిల్ లాంటి స్టార్లుతో పాటు సూర్య గెస్ట్ రోల్ చేయడం కూడా ఆకర్షించింది. కత్తి, మాస్టర్ లాంటి చిత్రాలు అందించిన లోకేష్ కనగారాజ్ దర్శకుడు కావడం కూడా ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. హీరో నితిన్ హోం బ్యానర్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం మరో విశేషం. ఇన్ని విశేషాలన్న విక్రమ్ కథలోకి వెళితే.. 


కథ:


ప్రభంజన్ నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్. సంతానం (విజయ్ సేతుపతి) ది చీకటి వ్యాపారం. డ్రగ్స్ తయారు చేసి దేశ విదేశాలు సప్లయ్ చేస్తుంటాడు. సంతానంకు కొందరి పోలీసుల అండదండాలు కూడా వుంటాయి. సంతానంకి సంబధించిన డ్రగ్ కన్టైనర్లని పట్టుకుంటాడు ప్రభంజన్. ఇది జరిగిన వారం తర్వాత ముసుగు వేసుకున్న ఓ ముఠా ప్రభంజన్ గొంతు కోసి చంపేసి ఆ వీడియోని పోలీసులకే పంపిస్తారు.


తర్వాత మరో రెండు హత్యలు కూడా ఇలానే జరుగుతాయి. ఆ ముసుగు ముఠాని పట్టుకోవడానికి అండర్ కాప్ అమర్ (ఫాహాద్ ఫాసిల్) ని రంగంలో దించుతారు పోలీసులు. అమర్ తన శైలిలో విచారణ మొదలు పెట్టిన అమర్ కి ఎలాంటి నిజాలు తెలిశాయి ? ఈ ముఠాతో విక్రమ్ (కమల్ హాసన్ )కి వున్న సంబంధం ఏమిటి ? ప్రభంజన్ ఎవరు చంపారు ? ప్రభంజన్ కి విక్రమ్ మధ్య వున్న అనుబంధం ఏమిటి ? సంతానంని విక్రమ్ ఎలా అంతం చేశాడనేది తెరపై చూడాలి. 


విశ్లేషణ :


కథ చెప్పినపుడు విక్రమ్ పాత్రని ముందుగా ఎందుకు ప్రస్థావించలేదనే సందేహం రావచ్చు. విక్రమ్ పాత్ర గురించి కథలో పూర్తిగా చెప్పేస్తే సినిమాలో వున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ మిస్ అవుతుంది. అందుకే ఈ కథని ప్రభంజన్ కోణం నుండి చెప్పాల్సి వచ్చింది. ఇదలావుంచితే.. విక్రమ్ ఒక డార్క్ మూవీ. 


చీకటి రాజ్యనికి సంబధించిన కథ. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథ. ఐతే ఇందులో డ్రగ్స్ వినియోగదారులు కనిపించరు. తయారీదారులు కనిపిస్తారు. దీని చుట్టూ వుండే వ్యవస్థలు కనిపిస్తాయి. ఓ సామాన్యకుర్రాడి చేతికి ఒక డ్రగ్ ప్యాకెట్ ఎలా వస్తుంది? దాని వెనుక ఎలాంటి మనుషులు వుంటారు ? ఎంత కితారకంగా వుంటారు ? ఇలాంటి చీకటి కోణాలన్నీ విక్రమ్ లో కనిపిస్తాయి. 


ఒక డార్క్ మూవీని చూస్తున్నామని ముందే ప్రిపేర్ అయి చూస్తే విక్రమ్ కనెక్ట్ అవుతుంది. ఆ పాత్రలు కనెక్ట్ అవుతాయి. ఈ కథలో కొన్ని లేయర్స్ వున్నాయి. వాటి నుండి వివరాలని ఆశించకూడదు. ప్రేక్షకుడు కూడా కొంత అర్ధం చేసుకొని చూడాల్సిందే. వరుస హత్యలు తర్వాత అమర్ పాత్ర ఎంటర్ అవుతుంది. దాదాపు అమర్ చేసే విచారణలో ఒకొక్క పాత్ర పరిచయమౌతూ కథ ముందుకు వెళుతుంది. సంతానంగా విజయ్ సేతుపతి పరిచయం టెర్రీఫిక్ గా వుంటుంది.


తర్వాత కర్ణన్ గా కమల్ పాత్ర చుట్టూ విచారణ నడుస్తుంది. కర్ణన్ పాత్రతో వచ్చిన ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ సీన్ విక్రమ్ కథకు కొత్త ఊపు తెస్తుంది. ద్వితీయార్ధంలో విక్రమ్ గా కమల్ షో వుంటుంది. ఈ క్రమంలో హైవోల్టేజ్ యాక్షన్ సీన్లు వస్తాయి. సంతానం ఇల్లు పేల్చడం, విక్రమ్ ఇంట్లో పని మనిషి చేసిన ఫైట్, అమర్ భార్యని చంపిన సీన్, క్లైమాక్స్ లో చిన్న బాబు ప్రాణాల కోసం రాసుకున్న సీన్ .. అన్నీ వర్క్ అవుట్ అయ్యాయి. పెద్ద మిషన్ గన్ పేల్చడం కూడా ఒక వార్ ని తలపిస్తుంది. చివర్లో సూర్య పాత్రతో విక్రమ్ 2 వుందని కూడా హింట్ ఇచ్చాడు దర్శకుడు. 


నటీనటులు


కమల్ హాసన్ నట విశ్వరూపం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అయితే విక్రమ్ ఆయన చేసిన రోల్ చాలా భిన్నమైనది. ఇందులో ఫస్ట్ హాఫ్ పూర్తయిన వరకూ ఒక్క డైలాగ్ కూడా వుండదు. ఫస్ట్ హాఫ్ అంతా విజయ్ సేతుపతి, ఫాహాద్, పోలీసు ఆఫీసర్లతోనే నడిపారు. 


కమల్ అక్కడక్కడా కనిపిస్తారంతే. అదీ కూడా ఊహలో కనిపించినట్లుగా. అయితే సెకండ్ హాఫ్ లో కమల్ షో వుంటుంది. అక్కడ కూడా మాటలు తక్కువే. యాక్షన్ వుంటుంది. విజయ్ సేతుపతి చేసిన సంతానం పాత్రం భయకంరంగా వుంది. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అమర్ పాత్ర చేసిన ఫాహాద్ ఫస్ట్ అంతా కనిపిస్తాడు. అతని నటన చాలా సహజంగా వుంది. మిగతా నటులంతా పరిధి మేర చేశారు. 


టెక్నికల్ గా  : 


సాంకేతికంగా సినిమా వున్నంతంగా వుంది. అనిరుధ్ రవిచందర్ నేపధ్య సంగీతం సీన్స్ కి ఆయుపట్టు. ట్రాక్స్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. పాటలు ప్రాధన్యత లేదు. మత్తురా పాట ఇంట్రో లా వాడుకున్నారు.  గిరీష్ గంగాధరన్ బావుంది. చీకటి ప్రపంచాన్ని అంతే డార్క్ గా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి


ప్లస్ పాయింట్స్ : 


కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాసిల్ 
యాక్షన్ సీన్స్
నిర్మాణ విలువలు, నేపధ్య సంగీతం 


మైనస్ పాయింట్స్ :


ఎమోషన్ కనెక్షన్ లేకపోవడం 
కొన్ని  సాగదీత సన్నివేశాలు
 

ఫైనల్ వర్దిక్ట్ : విక్రమ్ .. చీకటి రాజ్యం!

ALSO READ: 'మేజ‌ర్‌' మూవీ రివ్యూ రేటింగ్!