ENGLISH

ప్ర‌భాస్ ఢీ కొట్టేది ఎవ‌రినో తెలుసా?

20 August 2020-14:00 PM

ప్ర‌భాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్‍’ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎప్పుడైతే టైటిల్ ని ప్ర‌క‌టించారో, అప్ప‌టి నుంచీ న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే ప‌నిలో బిజీ అయిపోయింది చిత్ర‌బృందం. తాజాగా.. విల‌న్ ని సైతం ఫైన‌ల్ చేశార‌ని బాలీవుడ్ టాక్‌. అందుకోసం సైఫ్ అలీఖాన్ ని ఎంచుకున్నార‌ని స‌మాచారం అందుతోంది.

 

ఓం రౌత్‍ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన‌ ‘తానాజీ’లో సైఫ్ ఓ కీల‌క పాత్ర పోషించాడు. ఇప్పుడు త‌న‌నే.. ఈసినిమాలో విల‌న్ గా ఫిక్స్ చేశాడ‌ని తెలుస్తోంది. పైగా ఓం రౌత్‌, సైఫ్ మంచి మిత్రులు. అందుకే.. విల‌న్ కోసం మ‌రో ఆప్ష‌న్ పెట్టుకోలేద‌ట‌. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అన్ని భాష‌ల‌కు సంబంధించిన న‌టీన‌టులూ ఇందులో క‌నిపించ‌నున్నారు. శూర్ప‌ణఖ పాత్ర‌లోనూ ఓ తెలుగు క‌థానాయిక క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ALSO READ: నితిన్ కు జోడీగా నభ ఫిక్స్?