ENGLISH

సకుటుంబ సపరివార 'తందాన' రాగం.!

03 December 2018-13:23 PM

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న 'వినయ విధేయ రామ' పోస్టర్లు కెవ్వు కేక పుట్టించేస్తున్నాయి. ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ అంటూ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న పోస్టర్స్‌ చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదంటే అతిశయోక్తి కాదు. మామూలుగానే బోయపాటి సినిమాలంటేనే స్క్రీన్‌ నిండా జనంతో కళ్ళకు నిండుగా రంగుల హరివిల్లులా ఉంటాయి. ఇక అదే ఫార్ములా ఇప్పుడు చరణ్‌ సినిమాకీ ఫాలో అయినట్లు కనిపిస్తోంది. 'వినయ విధేయ రామ' అని టైటిల్‌ విడుదల చేస్తూ, రామ్‌చరణ్‌ యాక్షన్‌ మాస్‌ లుక్‌ని వదిలాడు. ఆ తర్వాత వచ్చిన టీజర్‌ కూడా యాక్షన్‌నే తలపించింది.

ముచ్చటగా మూడో లుక్‌ టైటిల్‌కి యాప్ట్‌ అనేలా రాముని వినయం చూపించాడు రామ్‌చరణ్‌. ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ కోసం విడుదల చేస్తున్న పోస్టర్లు మాత్రం కలర్‌ఫుల్‌గా కంటికింపుగా కనిపిస్తున్నాయి.ఈ రోజు సాయంత్రం ఈ సినిమా నుండి 'తందాన తందాన' అంటూ సాగే ఆడియో సింగిల్‌ రాబోతోంది. ఇది ఫ్యామిలీ సాంగ్‌ అని మొదటే చెప్పేశారు. అందుకే పోస్టర్స్‌లో ఫ్యామిలీ అంతా నిండుగా కనువిందు చేస్తోంది.

వెరీ లేటెస్టుగా బయటికొచ్చిన పోస్టర్‌లో చరణ్‌తో పాటు హీరోయిన్‌ కైరా అద్వానీ, అన్నయ్యలు ఆర్యన్‌ రాజేష్‌, ప్రశాంత్‌, సీనియర్‌ నటుడు చలపతిరావు, మరికొంత మంది అమ్మాయిలతో పాటు కమెడియన్‌ మధు తదితరులు హ్యాపీగా సెల్ఫీ దిగుతూ కనిపిస్తున్నారు. ఇక ఈ చల్లని సాయంత్రం వేళ వినయ విధేయ రాముని 'తందాన' ఫ్యామిలీ సాంగ్‌ని వినేందుకు రెడీ అయిపోండిక.

ALSO READ: టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ 'ఏఎమ్‌బి సినిమాస్‌'.!