ENGLISH

నిర్మాతగా మారిన వినాయకుడు హీరో

07 August 2020-10:12 AM

హీరోలు నిర్మాణ రంగంలో అడుగు పెట్టడం ఈమధ్య సాధారణంగా మారింది.  పెద్ద స్టార్ హీరోలు చాలామంది నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.  మరోవైపు నాని, సుధీర్ బాబు, సందీప్ కిషన్ లాంటి హీరోలు కూడా నిర్మాణ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే బాటలో తాజాగా మరో తెలుగు నటుడు నిర్మాతగా మారారు. ఆ నటుడు ఎవరో కాదు.. కృష్ణుడు.


'వినాయకుడు', 'విలేజ్ లో వినాయకుడు', 'ఏ మాయ చేసావే' లాంటి విజయవంతమైన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న కృష్ణుడు ఈమధ్య కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఒక సినిమాను నిర్మిస్తున్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  కృష్ణుడు కుమార్తె నిత్య పేరుమీద  నిత్య క్రియేషన్స్  అనే బ్యానర్  స్థాపించి ఓ కొత్త సినిమాను నిర్మిస్తున్నారట.


ఈ సినిమా టైటిల్ కూడా చూడగానే వెంటనే ఆకర్షించేలా ఉంది. 'మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్' అనేది సినిమా టైటిల్. ఈ సినిమాతో లోతుగడ్డ జయరామ్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.  హీరో హీరోయిన్లందరూ కొత్త వారేనట. మరి ఈ సినిమాతో కృష్ణుడు నిర్మాతగా విజయం సాధిస్తారా లేదా.

ALSO READ: MANCHU MANOJ COMPLETES 16 YEARS IN FILMS!