ENGLISH

విరాట‌ప‌ర్వం ద‌ర్శ‌కుడ్ని మార్చేశారా?

02 July 2021-16:15 PM

`నీదీ నాదీ ఒకే క‌థ‌`తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌. ఆ సినిమా చూసే.. `విరాట‌ప‌ర్వం` ఛాన్సిచ్చారు. విరాట‌ప‌ర్వం అభ్యుద‌య భావాలున్న క‌థ‌. న‌క్స‌ల్ నేప‌థ్యంలో సాగుతుంది. రానా, సాయి ప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి.. కీల‌క పాత్ర‌లు పోషించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. అయితే.. ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్ ప్ర‌కారం.. ఈ సినిమాకి వేణు ఉడుగుల‌తో పాటుగా మరో ద‌ర్శ‌కుడు కూడా ప‌ని చేశాడ‌ట‌. కొన్ని స‌న్నివేశాల్ని ఈ సినిమా కోసం రీషూట్ చేశార‌ని, ఆ రీషూట్ కి వేణు ఉడుగుల ని పక్క‌న పెట్టి, మ‌రో యువ ద‌ర్శ‌కుడితో ఆయా సన్నివేశాల్ని పూర్తి చేశార‌న్న టాక్ వినిపిస్తోంది.

 

ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కూ చిత్ర‌బృందం స్పందించ‌లేదు. సినిమాల‌కు రీషూట్లు అనేవి మామూలే. కానీ.. ద‌ర్శ‌కుడ్ని మార్చి రీషూట్ చేయ‌డం చాలా అరుదైన సంగ‌తి. రీషూట్ చేయ‌డం వేణు ఉడుగుల‌కు ఇష్టం లేద‌ని, అందుకే ద‌ర్శ‌కుడ్ని మార్చాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది. మ‌రి కొంత‌మంది మాత్రం రీషూట్ చేయాల్సివ‌చ్చినప్పుడు వేణు అందుబాటులో లేడ‌ని, ఆయ‌న అనుమ‌తి తీసుకునే, ఆయా స‌న్నివేశాల్ని మ‌ళ్లీ తెర‌కెక్కించార‌ని చెబుతున్నారు. ఇందులో ఏది నిజ‌మైనా స‌రే.. ఈ సినిమాకి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ప‌ని చేసిన‌ట్టు లెక్క‌.

ALSO READ: ఫుల్ స్వింగ్ లో వెంకీ.. చేతిలో మ‌రో మూడు సినిమాలు